చంద్రబాబుకు గిఫ్టు సిద్ధం చేస్తున్నాం.. కుల రాజకీయాలకు ఆయనే కారణం : తలసాని

Webdunia
మంగళవారం, 15 జనవరి 2019 (15:34 IST)
వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రిటర్న్ గిఫ్టు ఇవ్వడం ఖాయమని తెరాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. అంతేకాకుండా, ఏపీలో కులరాజకీయాలకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ప్రధాన కారణమన్నారు. 
 
ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన యాదవ మహాసభలో ఆయన పాల్గొన్నారు. ఇందులో తలసాని మాట్లాడుతూ, ఏపీ సీఎం చంద్రబాబుకు తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ యాదవ నేతలు రాజకీయంగా ఎదుగాలని ఆకాంక్షించారు. 
 
ఏపీ ప్రజలు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. తెరాస కాదు, ఏపీ ప్రజలే చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. ఏపీలో కుల రాజకీయాలకు కారణం చంద్రబాబేనని ఆరోపించారు. 
 
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రూ.5 వేల కోట్లతో యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, ఏపీలో కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీలోని యాదవులకే కాదు.. బీసీలకూ నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments