Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద‌నా బ్ర‌ద‌ర్స్ ఎండీ రామారావు అరెస్ట్

హైద‌రాబాదు: ప్ర‌ముఖ వ‌స్త్ర న‌గ‌ల వ్యాపార సంస్థ చంద‌నా బ్ర‌ద‌ర్స్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ రామారావును చీటింగ్ కేసులో ఎస్‌.ఆర్‌.న‌గ‌ర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీమంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కొడుకు ఫ‌ణీంద్ర త‌న‌ను బెద‌రిస్తున్నాడ‌ని ఇంత‌కుముందు పోలీస్

Webdunia
బుధవారం, 23 నవంబరు 2016 (21:32 IST)
హైద‌రాబాదు: ప్ర‌ముఖ వ‌స్త్ర న‌గ‌ల వ్యాపార సంస్థ చంద‌నా బ్ర‌ద‌ర్స్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ రామారావును చీటింగ్ కేసులో ఎస్‌.ఆర్‌.న‌గ‌ర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీమంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కొడుకు ఫ‌ణీంద్ర త‌న‌ను బెద‌రిస్తున్నాడ‌ని ఇంత‌కుముందు పోలీస్ స్టేష‌న్‌లో రామారావు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు బూట‌క‌మ‌ని తేల‌డంతో రామారావుపై చీటింగ్ కేసు న‌మోదు చేసిన పోలీసులు ఆయ‌న్ను అరెస్ట్ చేశారు.
 
చందనా బ్రదర్స్ ఎండీ రామారావు, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు ఫణీంధ్ర మధ్య తలెత్తిన వివాదం చివరికి అరెస్ట్ వరకు వెళ్లింది. తొమ్మిది కోట్ల రూపాయల రుణం కావాల‌ని కన్నా కుమారుడు ఫణీంద్రను కలిశాడు ఎండీ రామారావు. ఈ డీల్ లో కొంత కమీషన్ కూడా ఇస్తానని ఇద్దరి మధ్య అగ్రిమెంట్ జరిగింది. అనుకున్నట్లుగానే తొమ్మిది కోట్లలో కొంత లోన్ వచ్చింది చందనా ఎండీ రామారావుకు. మిగతాది రాలేదు. 
 
ఈ లోన్ విషయంలో ఫణీంద్రకు చెల్లించాల్సిన కమీషన్ పై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీన్ని పర్సనల్ గా తీసుకున్న రామారావు.. మూడు నెలల క్రితం ఫణీంద్ర నుంచి బెదిరింపులు వస్తున్నాయంటూ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. ఓ లేఖను కూడా ఇచ్చాడు. ఈ లేఖను రామారావే రాసి.. తన డ్రైవర్ తో గుంటూరు నుంచి పోస్ట్ చేయించాడు. విచారణలో ఇది తప్పుడు లేఖ అని తేలింది. పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు చందనా బ్రదర్స్ ఎండీని అరెస్ట్ చేశారు హైదరాబాద్ ఎస్.ఆర్.నగర్ పోలీసులు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments