Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ సర్కారు జీతాలివ్వలేకుంది.. ఆ నిధులిచ్చేయండి : జైట్లీకి వెంకయ్య వినతి

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2015 (13:38 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ కష్టాల నుంచి గట్టెక్కించేందుకు తెరాస ప్రభుత్వంతో పాటు... ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావులు చేసిన ప్రయత్నాలు ఏ ఒక్కటీ ఫలించలేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడిని ఆశ్రయించింది. 
 
ఆ వెంటనే రంగంలోకి దిగిన వెంకయ్య.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో చర్చించారు. తెలంగాణ సర్కారు నుంచి లాగేసుకున్న నిధులను తక్షణమే ఆ రాష్ట్రానికి ఇవ్వాలని ఆయన జైట్లీని కోరారు. దీనికి స్పందించిన జైట్లీ రెండు రోజుల్లోగా ఆ నిధులను తెలంగాణ ఖాతాకు జమ చేస్తామని వెంకయ్యకు హామీ ఇచ్చారు. 
 
ఫలితంగా తెలంగాణ ఖాతా నుంచి కేంద్రం లాగేసుకున్న రూ.1,250 కోట్ల నిధులు ఎట్టకేలకు తిరిగి ఆ రాష్ట్రానికి రానున్నాయి. ఈ నిధులను పన్ను చెల్లింపులో జాప్యాన్ని కారణంగా చూపుతూ కేంద్రం ముందస్తు సమాచారం లేకుండానే లాగేసుకున్న విషయం తెల్సిందే. దీంతో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తారుమారైంది. రెండు నెలల పాటు ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉద్యోగుల వేతనాలు మినహా ఏ ఇతర ఖర్చులకు కూడా నిధులు విడుదల చేయరాదని కూడా ప్రభుత్వం ఆయా శాఖలకు తేల్చిచెప్పింది. 

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

Show comments