గద్వాల అసెంబ్లీ ఎమ్మెల్యేగా డీకే అరుణ

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2023 (18:41 IST)
గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా డీకే అరుణ ఎన్నికైయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసింది. హైకోర్టు తీర్పు కాపీని జత చేస్తూ సీఈవోకు ఈసీ అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ లేఖ పంపించారు. 
 
డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో హైకోర్టు ఉత్తర్వులను తదుపరి గెజిట్‌లో ప్రచురించాలని ఆదేశాలు జారీ చేసింది. 
 
గత ఎన్నికల్లో గద్వాల నుండి కృష్ణమోహన్ రెడ్డి గెలిచారు. డీకే అరుణ రెండో స్థానంలో నిలిచారు. నామినేషన్ సందర్భంగా తప్పుడు వివరాల కారణంగా కృష్ణమోహన్ రెడ్డిపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినందుకు శిక్షగా రూ.2.50 లక్షలు జరిమానా విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

బ్రష్ చేస్తున్నా ఫ్లష్ చేస్తున్నా తెల్లపోరి మొఖమే తిరుగుతుంటది.. అంటూ దీవాన సాంగ్

తర్వాతి కథనం
Show comments