పెళ్లి చేసుకుని.. ప్రియుడితో జంప్ కావాలనుకుంది..

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (11:47 IST)
పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది కానీ రాత్రికి రాత్రే ప్రియుడితో కలిసి పారిపోవాలని వధువు ప్లాన్ చేసింది. కానీ సీన్ రివర్స్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన యువతికి మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. పెండ్లి కోసం వధువు కుటుంబ సభ్యులు శనివారమే వరుడి గ్రామానికి చేరుకున్నారు. 
 
పెండ్లి పీటలపై కూర్చున్న వధువు అదే పనిగా సెల్‌ఫోన్‌లో చాటింగ్ చేస్తుండడం, ఎవరితోనో మాట్లాడుతుండడంతో అనుమానించిన బంధువులు నిలదీయడంతో అసలు విషయం వెలుగుచూసింది. తాను మూడేళ్లుగా ఓ యువకుడిని ప్రేమిస్తున్నానని, పెండ్లి జరిగిన తర్వాత రాత్రికి అతడితో కలిసి వెళ్లిపోవాలని అనుకున్నామని అంగీకరించింది. 
 
అదే సమయంలో అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసిన వరుడి తరపు బంధువులు అతడు చెప్పింద విని విస్తుపోయారు. అతడి సెల్‌ఫోన్‌లో ఇద్దరి ఫొటోలను చూసి షాకయ్యారు. వెంటనే వారిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారించిన పోలీసులు ఎవరూ కేసు పెట్టకపోవడంతో ఇద్దరినీ వదిలేశారు. ఇరు వర్గాల అంగీకారంతో వధూవరులు ఎవరింటికి వారు వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments