Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదనపు కట్నానికి డిమాండ్.. పెళ్లికి 2 గంII ముందు వరుడు పరార్!

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2015 (12:06 IST)
నిజామాబాద్‌లో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. ముహుర్త సమయానికి సరిగ్గా రెండు గంటల సమయం ఉందనగా వరుడు పత్తాలేకుండా పోయాడు. అదనపు కట్నం కోసం డిమాండ్ చేయగా, ఆ మొత్తాన్ని తాము ఇవ్వలేమని వధువు తల్లిదండ్రులు చెప్పడంతో వరుడు పెళ్లి మండపం నుంచి పారిపోయినట్టు సమాచారం. శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
నిజామాబాద్ జిల్లా జకరంపల్లి మండలానికి చెందిన సాయికుమార్‌కు ఆర్యనగర్‌కు చెందిన మీనాక్షితో ఆరు నెలల క్రితమే వివాహం నిశ్చయమైంది. పెళ్లికుమార్తె బంధువులు సంప్రదాయం ప్రకారం ఎదుర్కోలు ద్వారా పెళ్లికొడుకును ఆర్యనగర్‌కు తీసుకువచ్చారు. అయితే పెళ్లి సమయానికి సాయికుమార్ కనిపించకుండా పోయారు.
 
ఒప్పుకున్న ప్రకారం రూ.లక్ష నగదుతో పాటు, బంగారం, బైక్ ఇచ్చినట్టు చెబుతున్నారు. అయితే పెళ్లికూతురు అందంగా లేదని.. అదనంగా మరో రూ.2 లక్షలు కట్నం ఇవ్వాలని వరుడు బంధువులు డిమాండ్ చేసినట్లు వారు తెలిపారు. ఇదేంటని ప్రశ్నించినందుకు వరుడి బంధువులు తమపై దాడి చేశారని పెళ్లికూతురు కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న వరుడి కోసం గాలిస్తున్నారు. 
 
 
మద్యం మత్తులో ఘర్షణ, వ్యక్తి దారుణ హత్య మద్యం మత్తులో ఓ వ్యక్తి మరో వ్యక్తిని పొడిచి చంపాడు. సూర్యాపేట భగత్‌సింగ్ నగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. పూటుగా మద్యం తాగిన ఇద్దరు వ్యక్తులు ఘర్షణకు దిగారు. గొడవ ముదరడంతో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి శ్రీనివాస్‌ అనే మరో వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు మ్యాట్రిమోనీ - ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు Read more 
 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments