వైఎస్. జగన్ - కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలే : బండి సంజయ్

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (19:35 IST)
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ సీఎం ఇద్దరూ తోడు దొంగలేనంటూ మండిపడ్డారు. ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర ఐదో విడత గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా కరీంనగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించగా, ఇందులో బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా పాల్గొన్నారు. 
 
ఇందులో బండి సంజయ్ ప్రసంగిస్తూ, కరీంనగర్ గడ్డ గర్జిస్తే కొందరికి వెన్నులో వణుకు పుడుతుందన్నారు. ప్రజల కోసం, ధర్మ కోసమే బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు తమ పార్టీ కట్టుబడివుందన్నారు. 
 
తెలంగాణాలో అవినీతి, కుటుంబ పాలనను అంతమొందిస్తామని, తెలంగాణాను కాషాయపు జెండాతో పవిత్రం చేస్తామని ప్రకటించారు. కరీంనగర్ స్ఫూర్తితో గడీల పాలనపై పోరాడుతామని ఆయన పిలుపునిచ్చారు. తెరాసను బీఆర్‌ఎస్‌గా మార్చారని, బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని ఎద్దేవా చేశారు. 
 
ఇకపోతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరూ ఒక్కటేనంటూ జగన్, కేసీఆర్ పేర్లను ప్రస్తావించకుండానే ధ్వజమెత్తారు. దోచుకో.. దాచుకో అనే సిద్ధాంతంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాలన చేస్తున్నారన్నారు. ఇద్దరూ కలిసి బిర్యానీలు, కాళ్లకూర, బ్రెయిన్ కూర, చేపల పులుపు, రొయ్యల పులుపు, చికెన్, మటన్ కర్రీలు తిన్నారని, ఇద్దరూ సీఎంలు కలిసి ఇపుడు కొత్త నాటకానికి తీశారని ఆరోపించారు. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించి, దాన్ని ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments