Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనారిటీల రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేస్తాం.. కేసీఆర్‌ను దించేందుకు బండి చాలు..!

Webdunia
శనివారం, 14 మే 2022 (22:28 IST)
తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక రాష్ట్రంలో మైనారిటీల రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేస్తామ‌ని బీజేపీ అగ్రనేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మైనారిటీ రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేసి... ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు పెంచుతామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.
 
బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడి హోదాలో ప్ర‌జా సంగ్రామ యాత్ర పేరిట పాద‌యాత్ర చేసిన బండి సంజయ్ త‌న యాత్ర‌ను శ‌నివారం ముగించారు. దీనిని పురస్కరించుకుని, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌కు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.
 
అలాగే పనిలో పనిగా తెలంగాణలోని కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ను గ‌ద్దె దించేందుకు బండి సంజ‌య్ ఒక్క‌డే చాల‌ని కూడా అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 
 
తెలంగాణ‌లో వార‌స‌త్వ రాజ‌కీయాలు పరాకాష్ఠకు చేరాయ‌ని అమిత్ షా ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామ‌కాల‌ను సాధిస్తామ‌ని హామీలిచ్చి అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్‌... ఆ హామీల‌ను తుంగ‌లో తొక్కార‌ని విమ‌ర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments