Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన గాలి అనిల్ కుమార్

Webdunia
గురువారం, 16 నవంబరు 2023 (09:40 IST)
Gali Anil Kumar
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. తాజాగా సీనియర్ నేత, టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు గాలి అనిల్ కుమార్ ప్రకటించారు. 
 
తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసినా సరైన గుర్తింపు రాలేదన్నారు. పార్టీ కోసం పని చేశానని, అన్ని విధాలా నష్టపోయానని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 
 
"నా విషయంలో ఇటీవలి పరిణామాలు నా అభిమానులను, కార్యకర్తలను తీవ్రంగా కలవరపరిచాయి. చాలామంది నా వద్దకు వచ్చి పార్టీ నాతో వ్యవహరించిన తీరుతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
కాంగ్రెస్ పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన వారికి పార్టీలో సరైన మార్గదర్శకత్వం లభించడం లేదు. పార్టీ కోసం కష్టపడి అన్ని విధాలా ఓడిపోయాను. నా కార్యకర్తలు, అభిమానుల ఒత్తిడి, మనోభావాలను గౌరవిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేస్తున్నా" అని ఖర్గేకు రాసిన లేఖలో అనిల్ కుమార్ తెలిపారు. 
 
అలాగే నర్సాపూర్ నుంచి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం తనకు టికెట్ కేటాయించకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో గాలి అనిల్ కుమార్ తన అనుచరులతో సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ గాలి అనిల్ కుమార్ బీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments