తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం ఎందుకు రేగుతోంది అని ప్రశ్నించారు. డ్రగ్స్ బయటపడిన సందర్భాల్లో కఠినమైన చర్యలు తీసుకుంటాం ఉక్కుపాదం మోపుతామని కేసీఆర్ హడావిడి చేస్తున్నారని విమర్శించారు.
ఎంతోమంది ఉద్యమకారులు శ్రీకాంత్ చారి, సుమన్ లాంటివాళ్ళు మరెందరో ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ వచ్చిందని, అలాంటి తెలంగాణలో మద్యం డ్రగ్స్ తదితర మత్తుపదార్థాల రాష్ట్రంగా కేసీఆర్ మార్చారని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సగం డ్రగ్స్ దందా టీఆర్ఎస్ నాయకులదేనని, వాళ్ల పేర్లు చెబితే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వాళ్లను పట్టుకునే దమ్ముందా? అని సవాల్ విసిరారు.
గత ఏడేళ్లుగా తెలంగాణలో డ్రగ్స్ దందా నియంత్రణకు ముఖ్యమంత్రి ప్రభుత్వానికి చేత కావడం లేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ సిటీలో డ్రగ్స్ దందా కొనసాగిస్తున్న వారిలో సగం మంది టీఆర్ఎస్ నాయకులకు సంబంధించినవే అని, వారి పేర్లను చెబితే వాళ్లను పట్టుకుని జైళ్లకు పంపుతారా? అని సంజయ్ కేసీఆర్‌కు సవాల్ విసిరారు.
దేశంలోనే మద్యం జూదం ఆడే ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణను కేసీఆర్ తీర్చిదిద్దినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బండి సంజయ్ విమర్శించారు.