Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌కు వాళ్లను పట్టుకునే దమ్ముందా? బండి సంజయ్

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (11:25 IST)
తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం ఎందుకు రేగుతోంది అని ప్రశ్నించారు. డ్రగ్స్ బయటపడిన సందర్భాల్లో కఠినమైన చర్యలు తీసుకుంటాం ఉక్కుపాదం మోపుతామని కేసీఆర్‌ హడావిడి చేస్తున్నారని విమర్శించారు.

ఎంతోమంది ఉద్యమకారులు శ్రీకాంత్ చారి, సుమన్ లాంటివాళ్ళు మరెందరో ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ వచ్చిందని, అలాంటి తెలంగాణలో మద్యం డ్రగ్స్ తదితర మత్తుపదార్థాల రాష్ట్రంగా కేసీఆర్ మార్చారని విమర్శించారు. 
 
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సగం డ్రగ్స్ దందా టీఆర్ఎస్ నాయకులదేనని, వాళ్ల పేర్లు చెబితే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వాళ్లను పట్టుకునే దమ్ముందా? అని సవాల్ విసిరారు. 
 
గత ఏడేళ్లుగా తెలంగాణలో డ్రగ్స్ దందా నియంత్రణకు ముఖ్యమంత్రి ప్రభుత్వానికి చేత కావడం లేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ సిటీలో డ్రగ్స్ దందా కొనసాగిస్తున్న వారిలో సగం మంది టీఆర్ఎస్ నాయకులకు సంబంధించినవే అని, వారి పేర్లను చెబితే వాళ్లను పట్టుకుని జైళ్లకు పంపుతారా? అని సంజయ్‌ కేసీఆర్‌కు సవాల్ విసిరారు.
 
దేశంలోనే మద్యం జూదం ఆడే ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణను కేసీఆర్ తీర్చిదిద్దినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బండి సంజయ్ విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments