Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ లడ్డూకు భలే డిమాండ్ - గతం కంటే రూ.1.30 లక్షలు అధికం

Webdunia
ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (10:47 IST)
హైదరాబాద్ నగరంలో బాలాపూర్ లడ్డూకు భలే గిరాకీ ఏర్పడింది. ఫలితంగా గత యేడాది కంటే ఈ లడ్డూ ధర రూ.1.30 లక్షలు అధికంగా పలికింది. కిందటేడాది కరోనా వైరస్ కారణంగా లడ్డూ వేలం పాటలు నిర్వహించలేదు. 2019లో రూ.17.60 లక్షల ధర పలుకగా, ఈ యేడాది ఈ లడ్డూ ధర రూ.18.90 లక్షలు పలికింది. 
 
తాజాగా జరిగిన వేలంపాటలో నాదర్‌గుల్‌కు చెందిన మర్రి శశాంక్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ కడప ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌తో కలిసి బాలాపూర్‌ గణేశుని లడ్డూని దక్కించుకున్నారు. 2019లో రూ.17.6 లక్షలకు కొలను రాంరెడ్డి సొంతం చేసుకున్నారు. గతేడాది కరోనా కారణంగా లడ్డూ వేలం పాట రద్దయింది.
 
ఇరు రాష్ట్రాల ప్రజలకు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌ అన్నారు. శశాంక్‌ రెడ్డితో కలిసి లడ్డూని దక్కించుకున్నట్లు చెప్పారు. ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డికి లడ్డూని కానుకగా అందిస్తామన్నారు. 
 
తెలుగు రాష్ట్రాల ప్రజలకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కొలను రాంరెడ్డి హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments