Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సోకిందనీ విద్యార్థిని గ్రామ బహిష్కరణ.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (11:19 IST)
తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం కొన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. తెలంగాణలో విద్యార్థులకు కరోనా సోకుతుండటం కొంత ఇబ్బంది కలిగిస్తోంది. వరుసగా విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. 
 
ఆదిలాబాద్ జిల్లాలోని ఓ గురుకులంలో ఇంటర్ చదువుతున్న సొన్‌దేవి అనే విద్యార్థిని ఇటీవలే కరోనా బారినపడింది. గురుకులం నుంచి సొంతగ్రామమైన ఇంద్రవెల్లి మండలంలోని సాలెగూడ గ్రామానికి వచ్చింది  అయితే, యువతిని గ్రామంలోకి రానివ్వకుండా అక్కడి పెద్దలు అడ్డుకున్నారు. 
 
కరోనా సోకడంతో ఆమెను పొలంలోనే ఓ చిన్న షల్టర్ వేసి అందులోనే ఉంచారు. గురుకుల అధికారులు గ్రామ పెద్దలను కలిసి మాట్లాడినా లాభం లేకపోయింది. మరో నాలుగు రోజుల్లో క్వారంటైన్ ముగుస్తుంది, ఆ తర్వాత సొన్ దేవిని గ్రామంలోకి ఆహ్వానిస్తామని గ్రామపెద్దలు వెల్లడించారు. 
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంది. ముఖ్యంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌జ‌లు క‌రోనా నిబంద‌న‌లు గాలికొదిలేసి తిరుగుతుండ‌టంతో, చ‌ర్య‌ల‌కు ఉపక్ర‌మించింది. మంగళవారం నుంచి ట్రాఫిక్ పోలీసులు స్పెష‌ల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. 
 
మాస్క్ లేకుండా ఎవ‌రైనా బ‌య‌ట క‌నిపిస్తే వారికి భారీ జ‌రిమానా విధించాల‌ని నిర్ణ‌యించారు. క‌రోనాను వ్యాప్తి చెంద‌కుండా నియంత్రించాలి అంటే, త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ పెట్టుకోవాలి. లేదంటే, మ‌హామ్మారికి చెక్ చెప్ప‌డం క‌ష్టం అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments