Webdunia - Bharat's app for daily news and videos

Install App

నబీల్ హత్య : నిందితులకు అండగా సీఐ... పోస్ట్‌మార్టం నివేదిక సిద్ధం!

Webdunia
మంగళవారం, 12 మే 2015 (17:36 IST)
హైదరాబాదులోని పాతబస్తీ స్ట్రీట్ ఫైట్లో మరణించిన నబీల్ మహ్మద్‌కు సంబంధించిన పోస్ట్‌మార్టం నివేదికను ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు సిద్ధం చేసి పోలీసులకు అందించారు. అతనికి 9 బలమైన దెబ్బలు తగిలాయని, తల, పక్కటెముకలు, కడుపులో బలమైన పిడిగుద్దులు తగలడంతో నబీల్ చనిపోయాడని ఆ నివేదికలో పేర్కొన్నారు. 
 
అంతేగాక తలకు రెండువైపులా పిడిగుద్దులు తగిలాయని, స్ట్రీట్ బాక్సింగ్ జరిగిన స్థలంలోనే నబీల్ చనిపోయాడని నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు స్ట్రీట్ ఫైట్ కేసులో అరెస్టైన 8 మంది నిందితుల తల్లిదండ్రులను మంగళవారం సౌత్ జోన్ డీసీపీ ఆఫీసుకు పిలిపించారు. వారి సమక్షంలోనే నిందితులకు డీసీపీ సత్యనారాయణ కౌన్సెలింగ్ ఇచ్చారు. నిందితులను బుధవారం రిమాండ్‌కు తరలిస్తామని చెప్పారు. 
 
మరోవైపు.. నబీల్‌ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులను తప్పించేందుకు ఓ పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ చక్రం తిప్పినట్లు పోలీసులు తమ ప్రాథమిక విచారణలో నిర్థారించారు. స్ట్రీట్ ఫైట్‌లో నబీల్‌ గాయపడిన రోజే ఆస్పత్రిలో అతని మృతిపై వైద్యపరమైన కేసు నమోదు చేయకుండా సీఐ అడ్డుకున్నారని సమాచారం. 
 
అయితే మీడియాలో ఈ బాక్సింగ్‌ దృశ్యాలు రావడంతో పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. అనేక కోణాల్లో కేసు విచారణ సాగించారు. దర్యాప్తులో భాగంగా ఈ కేసులో సీఐ ప్రమేయంపై పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. అదేవిధంగా ప్రేమకోణంలోనూ విచారణ సాగుతోంది. నబీల్‌, అతని స్నేహితులు అరేబిన్‌ గ్యాంగ్‌ పేరిట కొన్నాళ్లుగా స్ట్రీట్‌ఫైట్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments