Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్స్.. ఒక్కరోజు బంద్‌కు పిలుపు

Webdunia
గురువారం, 19 మే 2022 (09:40 IST)
రాష్ట్ర ప్రభుత్వం నూతన మోటర్ వాహనాల చట్టం-2019 అమలు చేస్తూ జరిమానాలతో నిలువు దోపిడీ చేస్తోందని, నూతన చట్టంను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నేడు ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్స్ యూనియన్ ఐకాస రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజు బంద్‌కు పిలుపునిచ్చింది.
 
ఇంధన ధరలు పెరుగుదలతో క్యాబ్, ఆటోలకు గిట్టుబాటు కావటం లేదని, దీనికితోడు నూతన చట్టం పేరుతో ఎడాపెడా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు జరిమానాలు విధిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వెంటనే నూతన మోటార్ వాహనాల చట్టం 2019ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
 
మరోవైపు ఆటోలు, క్యాబ్, లారీల డ్రైవర్లు గురువారం బంద్ పాటిస్తున్న క్రమంలో ప్రజలు ఇబ్బంది పడకుండా గ్రేటర్ హైదరాబాద్‌లో ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బుధవారం అర్థరాత్రి నుంచే ముఖ్యమైన ప్రయాణికుల అవసరాల మేరకు ప్రత్యేక బస్సుల నడుపుతుంది. 
 
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ప్రయాణీకులకు ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. పల్లెల్లకు రద్దీగా ఉండే రూట్లతో పాటు, జిల్లా కేంద్రాల్లో లోకల్ బస్సులు తిప్పేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments