Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహితతో ప్రేమాయణం... మందలించిన కుటుంబ సభ్యులు... కత్తితో దాడిచేసిన ప్రియురాలు

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2023 (15:16 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి కలెక్టర్ కార్యాలయంలో ఓ వివాహిత తన పైఅధికారిని కత్తితో పొడిచింది. ఈ అధికారి పెళ్లయిన మహిళతో గత రెండున్నరేళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఆ అధికారిని మందలించారు. దీంతో రెండు నెలల తర్వాత సెలవుల తర్వాత ఆయన శనివారం కార్యాలయానికి రాగా, అతనిపై ఆ మహిళ కత్తితో దాడి చేసింది. తన ఆత్మరక్షణ కోసమే దాడి చేసినట్టు ఆ మహిళ తెలిపింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో ఎన్.శిల్ప అనే మహిళ 2018 నుంచి ఆత్మకూరు (ఎం) మండల వ్యవసాయాధికారిగా పనిచేస్తున్నారు. అదేమండలంలోని పల్లపహాడ్‌ వ్యవసాయ విస్తరణాధికారిగా మనోజ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. శిల్పకు గత 2012లో వివాహం కాగా, రెండున్నరేళ్ల బాబు కూడా ఉన్నాడు. 
 
అయినప్పటికీ శిల్ప - మనోజ్ మధ్య రెండున్నరేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తుంది. ఈ విషయం మనోజ్ కుటుంబ సభ్యులకు తెలియడంతో మనోజ్‌‍ను మందలించారు. అప్పటి నుంచి అతడు ఆమెకు దూరంగా ఉంటూ వచ్చాడు. మూడు నెలల క్రితం యాదగిరిగుట్ట మండలోని మూసాయిపేటకు డిప్యూటేషన్‌పై వెళ్లిన మనోజ్.. రెండు నెలల పాటు సెలవు పెట్టాడు. 
 
శనివారం మధ్యాహ్నం తిరిగి విధులకు హాజరయ్యేందుకు కలెక్టరేట్‌లోని జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయానికి వచ్చాడు అతడితో మాట్లాడేందుకు శిల్ప ప్రయత్నించగా, అది వాగ్వాదం జరిగి అది ఘర్షణకు దారితీసింది. ఘర్షణ జరుగుతుండగానే శిల్ప అకస్మాత్తుగా కత్తితీసి అతడిపై దాడి చేసింది. మెడ, వీపు భాగాలపై గాయాలు కావడంతో మనోజ్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ఘటనపై శిల్ప మాట్లాడుతూ, మనోజ్‌తో తాను గత రెండేళ్లుగా రిలేషన్‌లో ఉన్నట్టు చెప్పింది. తామిద్దరం రహస్యంగా వివాహం చేసుకున్నట్టు వెల్లడించింది. భర్తకు విడాకులిచ్చి తనతోనే ఉండాలని మనోజ్ ఒత్తిడి చేశాడని, బాబును కూడా తీసుకొస్తానంటే చంపేస్తానని బెదిరించాడని చెప్పింది. మనోజ్ తనపై కత్తితో దాడి చేస్తే కేవలం ఆత్మరక్షణ కోసమే తాను దాడి చేసినట్టు చెప్పింద. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments