Webdunia - Bharat's app for daily news and videos

Install App

గిఫ్ట్ ఏ స్మైల్‌కు యాంక‌ర్ ప్ర‌దీప్ విత‌ర‌ణ‌

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (20:54 IST)
మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వికలాంగుల కోసం చేపట్టిన వాహనాల పంపిణీకి  ప్రముఖ యాంకర్ ప్రదీప్, అతని స్నేహితులు ముందుకు వచ్చారు. వీరు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ని కలిసి, ఎస్.వీ ప్రొడక్షన్స్ ద్వారా ఎస్.వీ వెంకట బాబు తమవంతు సాయంగా 15 లక్షల రూపాయ‌లు అందించారు.

అలాగే త్రివేణి హెచ్.డీ.పీ.ఈ పైప్స్ సంస్థ తరుపున పి.మురళీకృష్ణ, శ్రీనివాస్ లు  మరో 4 లక్షల అందజేశారు. ఈ మొత్తాన్ని వికలాంగులకు అందిస్తున్న ప్రత్యేక వాహనాల కొనుగోలుకు ఉపయోగించాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు.
 
తాము ఈ విధంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నందుకు సంతోషంగా ఉందని యాంకర్ ప్రదీప్ తెలిపారు. వికలాంగులకు చేయూత నిచ్చేందుకు ముందుకు వచ్చిన యాంకర్ ప్రదీప్, త‌న స్నేహితులను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అభినందించారు. వారితో త‌న ఛాంబ‌ర్లో ప్ర‌త్యేకంగా స‌మావేశమై, వారిచ్చిన చెక్కుల‌ను స్వీక‌రించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments