Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ గ్రామంలో 4 గంటలకు సూర్యాస్తమయం... 7 గంటలకు సూర్యోదయం...

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (17:04 IST)
మనం సాధారణంగా సూర్యడు సాయంత్రం ఆరు గంటలకు అస్తమించడం చూసుంటాం. కానీ ఒక ఊరులో నాలుగు గంటలకే సూర్యుడు అస్తమిస్తాడు. అప్పటికే చీకటి పడిపోతుంది. అదే పెద్దపల్లి లోని సుల్తానాబాద్ మండలంలోని కుదురుపాక. మరో విశేషం ఏమిటంటే అక్కడ ఒక గంట ఆలస్యంగా సూర్యుడు ఉదయిస్తాడు. 
 
ఈ ప్రాంతంలో అలా జరగడానికి గల కారణం ఉండనే ఉంది. దానికి ప్రధాన కారణం గ్రామానికి తూర్పు మరియు పడమర దిక్కులలో ఎత్తయిన కొండలు ఉండటం. వర్షా కాలం వచ్చిందంటే ఇంకా ముందే సూర్యాస్తమయం అవుతుందట. తూర్పు దిక్కున కొండలు ఉండటం వలన సూర్యోదయం కూడా ఒక గంట ఆలస్యం అవుతుంది. 
 
ఉదయం, రాత్రి వేళ్లల్లో తేడా ఉండడంతో ఈ గ్రామానికి మూడు జాముల కుదురుపాకగా పేరు వచ్చింది. సాయంత్రం కాగానే సూర్యుడు రంగనాయకుల గుట్ట వెనుక దాక్కుంటాడని  గ్రామస్థులు చెబుతున్నారు. పనులకు వెళ్లిన వారు చీకటిపడుతుందని త్వరగానే ఇంటికి చేరుకుంటారు. ఊరికి నాలుగువైపులా ఉన్న గుట్టలు కొంత ప్రయోజనం చేకూర్చినా వేసవి కాలంలో ఇబ్బంది ఉంటుందని గ్రామస్థులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments