సైకిల్ గెలుపు కోసం అల్లు అర్జున్ తెలంగాణలో ప్రచారం..?

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (18:21 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సైకిల్‌కు ప్రచారం చేయబోతున్నారా. తెలంగాణా రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నం నుంచి గత ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా అల్లు అర్జున్ మామ కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేయగా ఈసారి ఆయనకు టిక్కెట్టు రాలేదు. అయితే టిడిపి నుంచి పోటీ చేయడానికి చంద్రశేఖర్ రెడ్డి సిద్ధమయ్యారు. తన అల్లుడు సపోర్ట్ కూడా కోరారట చంద్రశేఖర్ రెడ్డి. మామ కోరిక మేరకు అల్లు అర్జున్ తెలంగాణా ఎన్నికల ప్రచారంలో టిడిపి తరపున చేసేందుకు సిద్థమవుతున్నాడట.
 
2014 టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు చంద్రశేఖర్ రెడ్డి. అయితే ఓడిపోయారు చంద్రశేఖర్. ఈ ఎన్నికల్లో టిక్కెట్టు కోసం ఆశించారు. కానీ ఆయనకు కాకుండా వేరే వ్యక్తికి టిక్కెట్టు ఇవ్వడంతో చంద్రశేఖర్ రెడ్డి ఎలాగైనా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ముందుగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నారు. 
 
కానీ మహాకూటమిలో చేరి టిడిపి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సారి ఎలాగైనా ఎమ్మెల్యే అవ్వాలన్నదే చంద్రశేఖర్ రెడ్డి ఆలోచన. దీంతో తన అల్లుడి సహకారం తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరో రెండుమూడురోజుల్లో అల్లు అర్జున్ తన మామ తరపున తెలుగుదేశం పార్టీకి తెలంగాణాలో ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments