Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆరా... మజాకా!... అన్ని ఆఫీసులు ఒక్కచోటే... ఎందుకంటే?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలియాస్ కేసీఆర్ పరిపాలనను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వాన్ని ముందుకు త

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2017 (06:33 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలియాస్ కేసీఆర్ పరిపాలనను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఈ క్రమంలో ఎదురయ్యే అనేక అవాంతరాలను సైతం ఆయన అలవోకగా ఎదుర్కొంటున్నారు. 
 
తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే కాకుండా, జిల్లా కేంద్రాల్లో కూడా అన్ని ఆఫీసులు ఒక్కచోటే ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. అంటే.. జిల్లా స్థాయి కార్యాలయాలన్నీ ఒక్కచోట కొలువుతీరేలా అన్ని జిల్లాల్లో సమీకృత జిల్లా కార్యాలయాల ప్రాంగణాలు నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
 
పోలీసు, అగ్నిమాపక శాఖ మినహా ఇతర అన్ని కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండాలని ఆయన చెప్పారు. అలాగే ప్రతి జిల్లాలోనూ జిల్లా పోలీసు కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో నూతన కార్యాలయాలు ఉన్నందున అవి మినహాయించి మిగిలిన 28 జిల్లాల్లో భవనాల నిర్మాణానికి ఈ బడ్జెట్‌లోనే నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. 
 
తన అధికారిక నివాసమైన ప్రగతిభవన్‌లో సమీకృత జిల్లా కార్యాలయాల నిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కార్యాలయాలకు డిజైన్లను ఖరారు చేసి టెండర్లు పిలువాలని, ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తిచేయాలని ఆదేశించారు. కొత్త కార్యాలయాలు అన్ని వసతులతో ప్రజలకు, అధికారులకు అనువుగా ఉండాలని సీఎం సూచించారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments