తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు దుర్గాదేవి ఇకలేరు

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (09:28 IST)
తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు కొండపల్లి దుర్గాదేవి ఇకలేరు. ఆమె వయసు 89 యేళ్లు. అఖిల భారత మహిళా సంఘం సీనియర్ నాయకురాలు కూడా. వృద్దాప్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆమె మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆమె తండ్రి వీర రాఘవరావు, ఆమె భర్త, మాజీ ఎమ్మెల్యే కేఎల్ నరసింహారావు ప్రభావంతో వామక్ష ఉద్యమాలవైపు మొగ్గు చూపారు. ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్రను పోషించారు. 
 
1974లో జరిగిన తొలి మహాసభలో దుర్గాదేవి ఐద్వా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె భర్త నరసింహా రావు. ఇల్లందు నియోజకవర్గం నుంచి మూడుసార్లు శాసనసభకు ప్రాతినిథ్యం వహించారు. 
 
ఆమె భౌతికకాయాన్ని బుధవారం ఉదయం 9.10 గంటలకు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత ఖమ్మంలో అంత్యక్రియలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. దుర్గాదేవి మృతిపట్ల ఐద్వా జాతీయ నేత బృందా కారత్‌తో పాటు పలువురు సంతాపం తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: త్రిషకు పెళ్లైందా... మెడలో ఆ మంగళసూత్రం ఏంటి... ఎవరు కట్టారు?

స్టార్స్ ఉంటేనే పెద్ద సినిమా కాదు.. : కమల్ హాసన్

తిరుచ్చి నుంచి రాఘవ లారెన్స్ పోటీ.. జూన్ 11న ప్రకటిస్తానని హింట్

నా చెస్ట్, నడుము భాగాలను ఫోకస్ చేసే షాట్స్ వద్దు : జాన్వీ కపూర్

Ram 23: రామ్ పోతినేని 23 చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా తిరు ఖరారు

తర్వాతి కథనం
Show comments