Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణస్నేహితుడి భార్యను లొంగదీసుకున్నాడు, ఇద్దరూ కలిసి జంప్, ఫోన్లు స్విచాఫ్

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (22:15 IST)
వారిద్దరూ ప్రాణస్నేహితులు. చిన్నతనం నుంచే కలిసి ఉన్న వారు పెద్దయిన తరువాత కూడా ఒకరంటే ఒకరు విడిచి ఉండే వారు కాదు. అలాంటి స్నేహం వారిది. ఒక స్నేహితుడికి పెళ్ళి జరిగితే మరో స్నేహితుడికి పెళ్ళి కాలేదు. అయినా పెళ్ళయిన వ్యక్తి తన స్నేహితుడిని పరిచయం చేయించి ప్రాణస్నేహితుడిగా చెప్పాడు. అదే తాను చేసిన తప్పని ఆ తరువాత అతనికి అర్థమైంది.
 
మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన అంకిత్ శుక్లా, యోగేష్‌లు స్నేహితులు. వీరిలో యోగేష్ బేగంబజార్‌లో వ్యాపారం చేస్తున్నారు. శుక్లాకు వివాహం జరిగింది కానీ ఇంకా ఆర్థికంగా సెటిల్ కాలేదు. దీంతో స్నేహితుడు యోగేష్ సూచలన మేరకు బిజినెస్ పార్టనర్స్ అవుదామనుకున్నాడు.
 
తన దగ్గర ఉన్న కొంత డబ్బును యోగేష్‌కు ఇచ్చి వ్యాపారాన్ని ప్రారంభించారు. యోగేష్ ఉన్న ప్రాంతంలోనే మరొక ఇంటిని అద్దెకు తీసుకున్నారు అంకిత్ శుక్లా..అతని భార్య. యోగేష్ ప్రాణ స్నేహితునితో పాటు బిజినెస్ పార్టనర్ కావడంతో అతని భార్యను పరిచయం చేశాడు.
 
స్నేహితుడు కదా అనుకుని పరిచయం చేసినందుకు చివరకు యోగేష్ నట్టేట ముంచాడు. శుక్లా భార్యను మెల్లగా ముగ్గులోకి లాగాడు. ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. స్నేహితుడికి ఎక్కడ తెలిసిపోతుందనుకుని ఆమెకు మెల్లగా మాయమాటలు చెప్పి పదిరోజుల క్రితం తీసుకెళ్ళిపోయాడు. భార్య కనిపించకపోవడంతో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
 
దాంతో పాటు యోగేష్ కనిపించకపోవడంతో శుక్లాకు అనుమానం వచ్చింది. ఇద్దరి నెంబర్లు స్విచ్ ఆఫ్‌‌లో ఉండటంతో శుక్లా అనుమానమే నిజమైంది. అయితే పోలీసులు పారిపోయిన వారిద్దరినీ పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే శుక్లా భార్య మాత్రం తన ఇంటికి వెళ్లనని యోగేష్‌తోనే ఉంటానని చెబుతోందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments