Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహజీవనం చాలు, పెళ్లి వద్దన్నందుకు పెట్రోల్ పోసాడు

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన 25 ఏళ్ల రాకేష్‌ రాయ్‌ ఉపాధి నిమిత్తం హైదరాబాద్ లోని బోడుప్పల్‌‌కు వచ్చి ఏనిమిదేళ్లుగా నివాసం ఉంటున్నాడు. నాచారంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేసే షన్నుతో పరిచయం ఏర్పడి అది కాస్తా వ

Webdunia
మంగళవారం, 7 ఆగస్టు 2018 (14:29 IST)
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన 25 ఏళ్ల రాకేష్‌ రాయ్‌ ఉపాధి నిమిత్తం  హైదరాబాద్ లోని బోడుప్పల్‌‌కు వచ్చి ఏనిమిదేళ్లుగా నివాసం ఉంటున్నాడు. నాచారంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేసే షన్నుతో పరిచయం ఏర్పడి అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. షన్నుకు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
భర్తతో గొడవలు కారణంగా వేరుగా ఉంటుంది షన్ను. రాకేష్‌ రాయ్‌, షన్ను సహజీవనం చేస్తున్నారు. రాకేష్‌ తనను పెళ్లి చేసుకోవాలని పలుమార్లు అడిగినా తనకు పిల్లలు ఉన్నారని, పెళ్లి చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పింది షన్ను. ఎలాగూ సహజీవనం చేస్తున్నాం కదా అది చాలు అని చెప్పింది. 
 
ఐతే రాకేష్ మాత్రం ఒప్పుకోలేదు. తనను పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ పట్టుబట్టాడు. పలుమార్లు పెళ్లి విషయంపై ఇరువురు ఘర్షణ పడ్డారు. గత నెల 27న మరోసారి పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఇద్దరూ తీవ్రంగా పోట్లాడుకున్నారు. ఆ తర్వాత అర్థరాత్రి సమయంలో రాకేష్‌ రాయ్‌ ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి అక్కడి నుంచి నేరుగా ఉత్తరప్రదేశ్ పారిపోయాడు. షన్ను తండ్రి ఫిర్యాదు, మృతురాలి మరణ వాంగ్మూలంతో హత్య కేసుగా నమోదు చేసి ఉత్తరప్రదేశ్‌లో తలదాచుకున్న రాకేష్‌రాయ్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి - అనిల్ కాంబోలో మెగా చిత్రం... టైటిల్ చెప్పిన దర్శకేంద్రుడు - ఆ పేరు ఇదే...

చరణ్ కొడుకులాంటివాడు... నాకున్న ఏకైక మేనల్లుడు : అల్లు అరవింద్ (Video)

మా విడాకుల అంశం మీడియాకు ఓ ఎటర్‌టైన్మెంట్‌గా మారింది : నాగ చైతన్య (Video)

ఫన్‌మోజీ ఫేమ్ సుశాంత్ మహాన్ హీరోగా కొత్త చిత్రం.. పోస్టర్ విడుదల

అఖండ 2 – తాండవం లో బాలకృష్ణ ను బోయపాటి శ్రీను ఇలా చూపిస్తున్నాడా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments