Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరె నీ యిష్టంతో పనేముంది, నాతో రాకపోతే నీ లైఫ్ ఇక్కడితో ఎండ్ అన్నాడు: మీడియాతో వైశాలి

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2022 (20:49 IST)
సంచలనం సృష్టించిన మన్నెగూడ కిడ్నాప్ కేసులో బాధితురాలు వైశాలి మీడియా ముందుకు వచ్చారు. తనను కారులో కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసాడనీ, అంగీకరించకపోతే ఇక్కడితోనే నీ లైఫ్ ఎండ్ అవుతుందని బెదిరించాడంటూ వెల్లడించారు.

 
శనివారం రాత్రి ఆమె మాట్లాడుతూ... నన్ను పెళ్లి చేసుకుంటానని బంధువు ద్వారా సంప్రదించాడు. నాకు ఇష్టం లేదని చెప్పాను. ఇక అప్పట్నుంచి వేధించడం మొదలుపెట్టాడు. ఫేక్ ఇన్‌స్టాగ్రాం క్రియేట్ చేసి నా మార్ఫింగ్ ఫోటోలు పెట్టి బ్లాక్ మెయిల్ చేసాడు. నువ్వంటే నాకిష్టం, బాగా చూసుకుంటా వచ్చేయవచ్చు కదా అనేవాడు.

 
నో అని చెప్పినదగ్గర్నుంచి ఇంటి ముందు న్యూసెన్స్ చేస్తూ వచ్చాడు. దీనిపై మూడు నెలల కిందట కంప్లైంట్ ఇచ్చాను. సీఐ గారు పట్టించుకోలేదు. మీ సేఫ్టీ మీరు చూసుకోవాలని అన్నారు. నన్ను కిడ్నాప్ చేసి కారులో తన ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. నన్ను పెళ్లాడకుంటే చంపేస్తానంటూ బెదిరించాడు. మీ నాన్నను అంతం చేస్తానన్నాడు. నా కెరీర్ ఎంతో వుంది. ఇలా బజారున పడేసి నా భవిష్యత్తును నాశనం చేస్తున్నాడు. పోలీసులు వెంటనే అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలి'' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది వైశాలి.

 
కాగా పోలీసులు ఇప్పటివరకూ 36 మందిపై కేసు నమోదు చేసారు. ప్రధాన నిందితుడు నవీన్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments