Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేరుకే అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్... హైదరాబాద్‌లో షాపింగ్ కాంప్లెక్స్ ఓనర్!

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2015 (14:25 IST)
తెలంగాణా రాష్ట్రంలోని అదిలాబాద్‌లో అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్‌గా పని చేస్తున్న ఓ అధికారి హైదరాబాద్‌లో కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులు సంపాదించాడు. హైదరబాద్‌లో ఏకంగా ఓ షాపింగ్ కాంప్లెక్స్‌కు ఓనర్‌గా మారాడు. ఈ అధికారి అక్రమార్జనపై అవినీతి నిరోధక విభాగం అధికారులు తవ్వే కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్ర ఔషధ తనిఖీ, నియంత్రణ మండలిలో అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్‌గా గోపాల్ రావు అనే వ్యక్తి పని చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్న గోపాల్.. భారీ ఎత్తున లంచాలు స్వీకరిస్తున్నారన్న ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. అదిలాబాద్, మలక్‌పేట, నేరేడ్‌మెట్ ప్రాంతాల్లో ఉన్న ఆయన నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. 
 
దాడుల్లో భాగంగా గోపాల్ పెద్ద ఎత్తున అక్రమాస్తులను పోగేశారని తేలింది. హైదరాబాదులోని దిల్‌సుఖ్ నగర్ ప్రాంతంలో ఏకంగా షాపింగ్ కాంప్లెక్స్‌లను గోపాల్ కలిగి ఉన్నట్టు గుర్తించారు. అలాగే, మలక్ పేట, చిక్కడపల్లిలో ఐదు, రెండు అతస్తుల భవనాలు, మల్కాజ్‌గిరిలో ఆరు ఫ్లాట్లు ఉన్నట్టు కనుగొన్నారు. ఇంకా కొనసాగుతున్న తనిఖీల్లో మరిన్ని అక్రమాస్తులు వెలుగు చూసే అవకాశాలున్నాయని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments