Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు ప్రలోభాల కేసు : నిందితుల విడుదల

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (12:40 IST)
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కేసులో నిందితులను రిమాండ్‌కు పంపించేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది. లంచాలు ఇవ్వజూపినట్టు నిరూపించేందుకు సరైన ఆధారాలు లేవని పేర్కొంది. పైగా, స్వాధీనం చేసుకున్న డబ్బు ఎంతో కూడా పోలీసులు స్పష్టత ఇవ్వలేదని గుర్తు చేసింది. లంచం సొమ్ము దొరకనందున పీసీ యాక్ట్ వర్తిందని, అందువల్ల నిందితులను తక్షణం విడిచిపెట్టాలని గత రాత్రి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. 
 
తెరాస ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో అరెస్టు అయిన ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. సరైన ఆధారాలు లేవన్న న్యాయస్థానం వారిని తక్షణం విడుదల చేయాలని ఆదేశించింది, అలాగే, 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చిన తర్వాత విచారించిన న్యాయమూర్తి జి.రాజగోపాల్ పోలీసులను ఆదేశించారు. 
 
అరెస్టు సందర్భంగా లంచం సొమ్ము దొరకనందున ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) వర్తించదని పేర్కొన్నారు. ప్రలోభాల కేసులో అరెస్టు అయిన నిందితులు రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్‌లను పోలీసులు గురువారం రాత్రి సరూర్ నగర్‌లోని న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లి హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాలతో వారిని విడిచిపెచ్చినట్టు శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments