Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ 2 ఛానెళ్ళ ప్రసారాలు కావాలని ప్రజలు అడగట్లేదు..

Webdunia
మంగళవారం, 21 అక్టోబరు 2014 (13:18 IST)
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 టీవీ ప్రసారాలను తమకు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం అడగడం లేదని, అందుకే వాటి ప్రసారాలను నిలిపివేసినట్టు తెలంగాణ ఎంఎస్ఓ సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీవీ9, ఏబీఎన్ ఛానెళ్ల ప్రసారాలను తెలంగాణ సర్కారు నిలిపివేసిన విషయం తెల్సిందే. ఈ విషయంలో జర్నలిస్టులు అనేక రకాలైన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, కేబుల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి ఒక వింతైన ప్రకటన చేశారు. 
 
‘ప్రజలు ఆ రెండు ఛానెళ్ళని ప్రసారాలను ప్రసారం చేయాలని కోరడం లేదు. అందుకే ప్రసారం చేయడం లేదు. ఆ రెండు ఛానెళ్ళ ప్రసారాలను నిలిపివేయడంలో ప్రభుత్వ పాత్ర, ఎంఎస్‌ఓల పాత్ర ఏమీ లేదు. న్యాయస్థానాలు కూడా మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చాయి. వ్యాపార ఒప్పందాలు కొనసాగించే ఆలోచన ఆ రెండు సంస్థల యాజమాన్యాలకు లేదని పేర్కొన్నారు.
 
మరి మిగిలిన చానెళ్లను తెలంగాణ ప్రజలు కోరుకుంటేనే సుభాష్ రెడ్డి గారు ప్రసారం చేస్తున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నవుతున్నాయి. ఆ రెండు చానెళ్ళను మాత్రమే నిలుపుదల చేయాలంటూ ప్రజలు ఆయనకు లేఖలు రాశారా అని పలువురు రాజకీయ నేతలు ప్రశ్నిస్తున్నారు. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments