Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపాధి కూలీలకు ఆధార్ ఆధారిత చెల్లింపులు.. అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ

ఉపాధి కూలీలకు ఆధార్ ఆధారిత చెల్లింపుల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఉపాధి కూలీలకు ఆధార్‌ ఆధారిత చెల్లింపులు చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో కొన్ని అక్రమాలను నిరోధించవచ్చని అధికారుల

Webdunia
ఆదివారం, 15 జనవరి 2017 (14:06 IST)
ఉపాధి కూలీలకు ఆధార్ ఆధారిత చెల్లింపుల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఉపాధి కూలీలకు ఆధార్‌ ఆధారిత చెల్లింపులు చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో కొన్ని అక్రమాలను నిరోధించవచ్చని అధికారులు చెబుతున్నారు. నేరుగా కూలీల బ్యాంకు ఖాతాల్లోనే వేతనం జమ చేస్తుండడంతో క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బంది అక్రమాలకు చెక్‌ పెట్టినట్లయింది.
 
ఉపాధి హామీ పథకం పనుల కల్పనలో ముందున్న తెలంగాణలో మొత్తం 55.9 లక్షల మంది జాబ్‌కార్డు కలిగివున్నారు. ఇందులో 53.4 లక్షల మంది అంటే 96 శాతం కూలీలకు ఆధార్‌ నంబరు అనుసంధానం చేశారు. ఇందులో 50.33 లక్షల మందికి అంటే 90 శాతం కూలీలకు ఆధార్‌ ఆధారిత చెల్లింపులు జరుగుతున్నాయి. 
 
జాతీయ సగటుతో పోలిస్తే... ఈ రెండు అంశాల్లోనూ తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. అయితే.. ఆధార్‌ అనుసంధానం అయిన కూలీలకే ఏప్రిల్‌ నుంచి చెల్లింపులు చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల స్పష్టం చేయడంతో రాష్ట్రం లక్ష్యం చేరుకునే దిశగా ముందుకెళ్తోంది. నమోదు ప్రక్రియను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments