Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూబ్లీహిల్స్‌ కేసులో ట్విస్ట్.. నిందితులకు కఠినశిక్ష ఖాయమా.. ఎలా?

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2022 (09:42 IST)
జూబ్లీహిల్స్‌ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ.. జువైనల్ కోర్టులో కాకుండా సాధారణ న్యాయస్థానంలో విచారణ జరిపేందుకు రంగం సిద్ధం అవుతోంది. 
 
సమగ్ర ఆధారాలతో హైదరాబాద్ కమిషనరేట్‌ పోలీసులు మరో రెండు రోజుల్లో న్యాయస్థానంలో మెమో దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే  జూబ్లీహిల్స్‌ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను మేజర్లుగా పరిగణించాలంటూ జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు అనుమతి ఆధారంగా తదుపరి చర్యలకు పోలీసులు సిద్ధమయ్యారు. 
 
రెగ్యులర్‌ న్యాయస్థానంలో విచారణ జరిగి నిందితులపై నేరం రుజువైతే కఠినశిక్షపడే అవకాశం కనిపిస్తోంది. కాగా మే 28న జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా అండ్‌ ఇన్‌సోమ్నియా పబ్‌ నుంచి ఒక బాలిక (17)ను తీసుకెళ్లి ఆరుగురు నిందితులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన సంగతి తెలిసిందే.   

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం