Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల కార్మికులు లేని సమాజం రావాలి: సీపీ సజ్జనార్‌

Webdunia
శనివారం, 28 డిశెంబరు 2019 (08:08 IST)
సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో ఈరోజు ఆపరేషన్ స్మైల్ లో భాగంగా మహిళా సంఘ సభ్యులు, స్మైల్ టీం మెంబర్స్ తదితరులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌, ఐపీఎస్ మాట్లాడుతూ.. బాల కార్మికులు లేని సమాజం రావాలన్నారు.

నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు.. నేటి బాలల చేతిలోనే రేపటి దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని అన్నారు. వీధి బాలలు అసాంఘిక శక్తులుగా మారకుండా చూడాల్సిన  బాధ్యతసమాజంలోని  ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ప్రతీ ఒక్క చిన్నారి స్కూల్లో ఉండాలన్నారు.

మినిస్ట్రీ ఆఫ్‌ హోం అఫైర్స్‌ ఆదేశాల మేరకు పోలీస్‌ శాఖ, చైల్డ్‌ వేల్ఫేర్‌ అధికారులు ప్రతి ఏటా జనవరీ నెలలో ఆపరేషన్‌ స్మైల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా దేశం లో ఎక్కడా లేని విధంగా సైబరాబాద్ లో మాత్రం ఈ బృందాలు 24 X 7 పనిచేస్తున్నాయన్నారు. 
 
ఆపరేషన్ ముస్కాన్ బృందాలు కమిషనరేట్‌ పరిధిలోని పలు కంపెనీలు, కార్ఖానాలు, గాజుల తయారీ కేంద్రాలు, ఇటుకల బట్టీల్లో బాలకార్మికులుగా పనిచేస్తున్న చిన్నారులను రక్షించారు. వారితోపాటు జంక్షన్ల వద్ద, టూరిస్టు ప్రాంతాల్లో యాచిస్తున్న చిన్నారులు, డంపింగ్‌ యార్డుల్లో చెత్త కాగితాలు ఏరుకుంటున్న బాలలను, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా అయిన చిన్నారులను చేరదీసి అక్కున చేర్చుకున్నారు.

ఆపరేషన్‌ స్మైల్ లో భాగంగా సైబరాబాద్‌ పోలీసులు 541 మంది చిన్నారులను రక్షించి తెలంగాణలోనే నంబర్‌-1 స్థానంలో నిలిచినట్లు సీపీ పేర్కొన్నారు. సైబరాబాద్‌లో పిల్లల సంరక్షణకు తొమ్మిది ఆపరేషన్ స్మైల్  బృందాలు పని చేస్తున్నాయన్నారు.  రక్షించిన చిన్నారులను తల్లిదండ్రులకు అప్పజెప్పడంతోపాటు మిగిలిన వారికి ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల హోంలలో పునరావాసం కల్పించారు.

తప్పిపోయిన మిస్సింగ్‌ కేసులను, అక్రమ రవాణాకు గురైన చిన్నారులను దర్పణ్‌ యాప్‌ (ఫేసియల్‌ రికగ్నైజింగ్‌ సిస్టం) ద్వారా గు ర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. చిన్నారులను పనిలో పెట్టుకొని బాలకార్మికులుగా మారుస్తున్న పలు కంపెనీలు, కార్ఖానాల యజమానులపై సైబరాబాద్‌ పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు.

పిల్లలను బాలకార్మికులుగా, యాచకులుగా, కాగితాలు ఏరుకునే పనులు చేయిస్తూ వారి బంగారు బాల్యాన్ని బుగ్గిపాలు చేస్తున్న తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించామని తెలిపారు . మాట వినని కొందరు తల్లిదండ్రులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసి, జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ అధికారులతో కలిసి చిన్నారులను సంరక్షిస్తున్నామన్నారు . భోజనం, విద్య, వైద్యం వంటి అన్ని మౌలిక వసతులను కల్పిస్తున్నామని చెప్పారు.

ఆపరేషన్ స్మైల్ లో భాగంగా రెస్క్యూ చేసిన పిల్లలు స్కూల్స్ లో ఉన్నారా లేదా అనే విషయాన్ని ఫాలో అప్ చేసుకోవాలన్నారు. రెస్క్యూ చిల్డ్రన్ డాటా బ్యాంక్ అండ్ ప్రొఫైల్స్ మెయింటెన్ చేయాలని సిబ్బందికి సూచించారు. 
ఎక్కడైనా బాలకార్మికులుగాని, రోడ్డుపై, ట్రాఫిక్‌ కూడళ్లు, దేవాలయాలు, టూరిస్టు ప్రాంతాల్లో యాచిస్తున్న చిన్నారులు కనిపిస్తే వెంటనే సైబరాబాద్‌ ‘ఆపరేషన్‌ ముస్కాన్‌, స్మైల్‌ టీమ్‌ వాట్సాప్‌ నెంబర్‌ 7901115474, కమిషనరేట్‌ వాట్సాప్‌ నంబర్‌ 9490617444లకు సమాచారం ఇవ్వండి అన్నారు.

డయల్‌ 100కు ఫోన్‌ చేసి కూడా చెప్పొచ్చు. అలాగే స్మైల్‌టీం సైబరాబాద్‌ ఎట్‌ ది రేట్‌ ఆఫ్‌ జీమెయిల్‌.కామ్‌కు వివరాలు పంపండి అన్నారు. మా సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి ఆ చిన్నారులకు రక్షణ కల్పిస్తారన్నారు. అనంతరం ఆపరేషన్ స్మైల్ VI బుక్ లెట్, బ్రోషర్/ కరపత్రాన్ని ఆవిష్కరించారు. 
 
అనంతరం డిసిపి ట్రాఫిక్ ఎస్ఎమ్ విజయ్ కుమార్, ఐపిఎస్., మాట్లాడుతూ ఆపరేషన్ స్మైల్ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులందరూ బాండెడ్ లేబర్ యాక్ట్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు. చిన్నారులు బాలకార్మికులుగా, భిక్షాటన చేయకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు.

అనంతరం బచ్ పన్ బచావో ప్రతినిధి వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ రోడ్ పై చిన్నారులు కనిపిస్తే ముందుగా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, చైల్డ్ లైన్ నంబర్, చియాల్డ్ వెల్ఫేర్ కమిటీ దృష్టికి తీసుకురావలన్నారు. ఈ సమన్వయ సమావేశంలో సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌, ఐపీఎస్., డిసిపి ట్రాఫిక్ ఎస్ఎమ్ విజయ్ కుమార్, ఐపిఎస్., డిసిపి షీ టీమ్స్ అనసూయ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్ పర్సన్ పద్మావతి, మహిళా సంఘాలు, షీ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments