Webdunia - Bharat's app for daily news and videos

Install App

బి.టెక్ అమ్మాయి వెంటపడ్డాడు.. లాడ్జీలకు తిప్పాడు.. విదేశాలకు పారిపోయాడు..?

Webdunia
బుధవారం, 17 జులై 2019 (15:12 IST)
వద్దన్నా వెంటపడ్డాడు. పెళ్ళి చేసుకుంటానని ప్రేమలోకి దింపాడు. మోసం చేసి దేశం వదిలి వెళ్ళాడు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటారు. కానీ అది నిజం కాదు. కొందరి మగవారి మాటలకు అర్థాలే వేరులే అని చెప్పాల్సి వస్తోంది. ప్రేమ, పెళ్ళి అనే పదాలకు అర్థాలనే మార్చేస్తున్నారు.
 
ఈ రెండు మాటలు చెప్పి అమ్మాయిల జీవితాలో ఆడుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో అదే జరిగింది. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయిన అమ్మాయి, మేనమామ ఇంటిలో ఉంటూ కష్టపడి బి.టెక్ వరకు చదువుకుంది. తన స్వశక్తితో లెక్చరర్ ఉద్యోగం తెచ్చుకుంది.
 
జీవితాన్ని అందంగా మలచుకోవాలనుకున్న ఆ అమ్మాయి పేరు మౌనిక. ఇప్పుడు నడిరోడ్డుపై నిలబడింది. ప్రేమ పేరుతో మోసపోయింది ఈ యువతి. శివ అనే వ్యక్తి ఆస్ట్రేలియాలో ఉన్నాడు. మౌనిక బి.టెక్ చదివే రోజుల్లో ప్రేమిస్తున్నాని వెంటపడ్డాడు. కానీ అతని ప్రేమను మొదట్లో ఒప్పుకోలేదు.
 
ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు ఇచ్చినప్పుడల్లా నల్గొండకు రావడం మౌనిక వెనుక తిరగడం. ఇదే అతని పనిగా మారిపోయింది. పెళ్ళిచేసుకుంటానని నమ్మించాడు. ప్రశాంతంగా సాగుతున్న జీవితంలో ప్రేమ అనే పేరుతో అలజడి రేపాడు. తల్లిదండ్రులు లేని తనకు అన్నీ తానై ఉంటానని నమ్మించాడు. అలా ఆమెను లొంగదీసుకున్నాడు. లాడ్జీలకు తిప్పాడు. 
 
శారీరక అవసరాలను తీర్చుకున్నాడు. ప్రేమించాను కానీ మావాళ్ళను ఎదిరించి పెళ్ళి చేసుకోలేనన్నాడు. కొన్నిరోజుల తరువాత మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న యువతి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆస్ట్రేలియాలో ఉన్న శివను అరెస్టు ఎలా చేస్తామని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. విషయం కాస్త గ్రామం మొత్తం తెలిసిపోయింది. దీంతో మౌనిక కన్నీరుమున్నీరవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments