Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లీ చెల్లీ అని పిలుస్తూనే లేపుకెళ్లి పెళ్లి చేసేస్కున్నాడు...

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (14:41 IST)
ఓ యువతిని చెల్లీచెల్లీ అని పిలుస్తూ స్నేహంగా మెలిగి దాన్ని కాస్తా మరో ప్రేమగా మార్చేసి లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు. ఈ ఘటన హైదరాబాదులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డిలోని శాంతినగర్‌కు చెందిన 21 ఏళ్ల షేక్‌ ఇంతియాజ్ నాంపల్లిలో బేకరీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు పని ముగించుకుని వీలున్నప్పుడల్లా తన దూరపు బంధువయిన సయ్యద్ అలీ ఇంటికి వస్తుండేవాడు. 
 
ఇలా వస్తూ సయ్యద్ 19 ఏళ్ల కుమార్తెతో పరిచయం పెంచుకున్నాడు. ఇంటికి వెళ్లినప్పుడల్లా ఆమెను చెల్లీ చెల్లీ అని పిలుస్తుండేవాడు. దానితో అతడు తరచూ ఇంటికి వస్తున్నా చెల్లీ అనడంతో పట్టించుకోలేదు. కానీ కొద్దిరోజుల క్రితం హఠాత్తుగా ఆమెను ప్రేమిస్తున్నాననీ, పెళ్లాడుతానని చెప్పి షాకిచ్చాడు. దాంతో అమ్మాయి తల్లిదండ్రులు ససేమిరా ఒప్పుకోలేదు. దీనితో ఇక లాభం లేదనుకుని యువతిని తీసుకెళ్లి రంజాన్‌ పండుగనాడు సదాశివపేటలోని ఓ దర్గా సమీపంలో పెళ్లి చేసేసుకున్నాడు.
 
తన కుమార్తె అతడితో వెళ్లిపోయి ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐతే వారు పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకున్న పోలీసులు యువతి తల్లిదండ్రులకి సమాచారం అందించారు. దీంతో తొలుత ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. దాంతో మెత్తబడిన యువతి తండ్రి కూతురు, అల్లుడిని తన ఇంటికి పంపాలనీ, వారిని ఏమీ చేయనని హామీ ఇచ్చాడు.

అతడి మాటలు నమ్మిన పోలీసులు వారిరువరినీ అతడికి అప్పగించారు. అంతే... అలా తీసుకెళ్తుండగానే అమీర్ పేట సమీపంలో పదిమంది వ్యక్తులు ఒక్కసారిగా నవ దంపతులపై దాడికి దిగారు. పెళ్లాడిన యువకుడిపై కత్తులతో దాడి చేశారు. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అప్రమత్తం కావడంతో అతడికి ప్రాణాపాయం తప్పింది.

నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా... తమ పరువు తీశాడనీ, ఫాతిమాను చెల్లి అని పిలుస్తూనే లేపుకెళ్లాడనీ, ఆమెకి వేరే యువకుడితో నిశ్చితార్థం చేశామని, ఇంతలో వీళ్లు ఇలా చేయడంతో తాము దాడి చేసినట్లు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments