Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ముక్కు, చెవులు కర్కశంగా కోసి ఠాణాకెళ్లిన 'మృగం' మొగుడు!

Webdunia
మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (18:24 IST)
పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య చెవులు, ముక్కును ఓ కసాయి భర్త కర్కశంగా కోసేశాడు. ఈ తరహా సంఘటనలు ఎప్పుడో త్రేతాయుగంలో రామాయణంలో శూర్పణఖ ముక్కుచెవులు కోశారని చిన్నపుడు చదువునివుంటాం. అయితే, ఈ కలియుగంలో కూడా ఈ తరహా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 
 
వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం గొల్లబుద్ధాపురంకు చెందిన రజిత, శ్రీనివాస్ అనే దంపతులు ఉన్నారు. భార్య రజితపై భర్త శ్రీనివాస్‌కు గత కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయమై గత రాత్రి కూడా భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున పడుకున్న భార్య చేతులు, కాళ్లను మంచానికి తాడుతో కట్టేసిన శ్రీనివాస్...ఆమె ముక్కు, చెవులు కోశాడు. 
 
తీవ్రంగా రక్తస్రావం అవుతూ మంచంలోనే పడి ఉన్న రజితను గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనలో శ్రీనివాస్కు అతని తల్లి కూడా సహకరించినట్లు సమాచారం. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసుతున్నారు. పరారీలో ఉన్న భర్త కోసం గాలిస్తున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments