Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలి కోసం పోలీస్ ఆఫీసర్‌గా అవతారమెత్తిన ప్రియుడు

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (21:05 IST)
ఒంటిపై పోలీసు యూనిఫామ్..తలపై మూడు సింహాల క్యాప్.. చేతిలో లాఠీ.. బెల్టు కింద కనిపించేలా రివాల్వర్.. చూస్తే ఎవరైనా పోలీసేనని నమ్మేలా బిల్డప్ ఇస్తాడతను. ఖాకీ వేషం వేసి మోసాలకు పాల్పడుతున్న ఆ యువకుడ్ని కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు.. 
 
ఇక విషయం లోకి వెళితే మనస్సు పడ్డ మగువ మదిని దోచేందుకు ఏకంగా పోలీసు డిపార్టుమెంట్లో ఏసీపీగా అవతారమెత్తాడు రవిచంద్ర. బీటెక్ చదివిన రవిచంద్ర సికింద్రాబాద్ మారేడ్ పల్లి సామ్రాట్ కాలనీలో నివాసముంటున్నాడు. డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగం చేసే రవిచంద్రతో పెళ్లి సంబంధం కుదుర్చుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఆదాయం కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఇలా అయితే జీవితంలో సెటిల్ కావడం కష్టమని..సులువుగా డబ్బు సంపాదించాలని భావించాడు. 
 
ప్రేమించిన ప్రియురాల్ని పెళ్లి చేసుకోవాలంటే ఆమె మనస్సును గెల్చుకోవాలని భావించాడు. అందుకు ఓ ప్లానేశాడితను. పోలీసు డిపార్ట్మెంట్లో 2012 బ్యాచ్ ఏసీపీనని.. ఇంటెలిజెన్స్ విభాగంలో పోలీస్ అధికారిగా అవతారమెత్తాడు. యూనిఫామ్ పైన నేమ్ ప్లేట్ తయారుచేసుకున్నాడు. ప్రియురాలి ముందు ఫోజు కొట్టేందుకు పోలీసు ఆఫీసర్ ఏసీపీ యూనిఫామ్‌ను కుట్టించుకున్నాడు. రియల్ పోలీస్ ఆఫీసర్‌లా ప్రియురాలి ఎదుట, ఇరుగు పొరుగు వారి ముందు తెగ బిల్డప్ ఇచ్చాడు. 
 
తనకు కోరుకున్న చోట పోస్టింగ్ వేయించాలని ఓ పోలీసు అధికారి వచ్చి.. నకిలీ ఏసీపీ రవిచంద్రను కలిశాడు. ఐడీ కార్డు జిరాక్స్ తీసుకుని దాన్ని మార్ఫింగ్ చేసి.. తన పేరిట కార్డు తయారు చేసుకున్నాడితను. దర్జా ఒలకబోస్తూ యూనిఫామ్‌లో ఠీవీగా వెళ్తుండటాన్ని గమనించిన స్థానికులు ఇతనితో పరిచయం పెంచుకున్నారు. తన పలుకుబడి ఉపయోగించి.. ఓ దాడి కేసులో నిందితుల్ని అరెస్ట్ చేయాలని నేరేడ్‌మెట్ పోలీసుల్ని కలిశాడు. ఇతని వాలకం చూసి.. ఆరా తీస్తే ఏసీపీ కాదని తేలడంతో రవిచంద్రను నేరేడ్‌మెట్ పోలీసులు అరెస్ట్ చేసి.. జైలుకు పంపారు. 
 
బెయిల్ పై బయటకు వచ్చి.. నేరేడ్ మెట్ నుంచి తన మకాంను మారేడ్‌పల్లి సామ్రాట్ కాలనీకు మార్చాడు రవిచంద్ర. జైలుకెళ్లొచ్చినా రవిచంద్ర తన బుద్ది మాత్రం మార్చుకోలేదు. పలు వివాదాల్లో తలదూర్చి తాను పోలీసు అధికారినంటూ బెదిరించేవాడితను. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల వేళ కూడా డ్యూటీకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుండటంతో అనుమానించి స్థానికులు ఇతన్ని ప్రశ్నించారు. తాను అనారోగ్యంతో ఉన్నానని.. సిక్ లీవ్ పెట్టానని నమ్మబలికాడు. ఆనోటా ఈనోటా పడి పోలీసులకు తెలియడంతో పోలీసులు ఇతని ఇంటికి వచ్చి.. ఆరా తీశారు. 
 
టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో ప్రశ్నించడంతో అసలు నిజం కక్కాడితను. ప్రియురాలి కోసం.. పైసలు సంపాదించడం కోసమే ఈ పోలీసు యూనిఫామ్ వేసుకుంటున్నట్టు అంగీకరించడంతో చివరికి ఇతన్ని అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.
 
ఈ నకిలీ ఏసీపీ రవిచంద్ర నుంచి పోలీసు యూనిఫామ్‌తో పాటు.. నకిలీ ఐడీ కార్డు, ఫిట్నెస్ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసు తదుపరి విచారణ నిమిత్తం టాస్క్ ఫోర్స్ పోలీసులు రవిచంద్రను మారేడ్ పల్లి పోలీసులకు అప్పగించారు. ఈ నకిలీ పోలీస్ అధికారి అసలు పోలీసులకు పట్టుబడి జైల్లో చిప్పకూడు తింటున్నాడు. నకిలీ ఏసీపీ బారిన పడి ఎవరైనా మోసపోయి ఉంటే ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments