Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగారెడ్డిలో ఢిల్లీ విద్యార్థి అనుమానాస్పద ఆత్మహత్య: ఏమైందో ఏమో.. కిటికీకి తాడు బిగించి?!

అంకుశాపూర్‌లోని ఎస్‌పీఆర్ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. యాజమాన్య వైఖరి కారణంగానే మృతి చెందినట్లు విద్యార్థి బంధువులు ఆరో

Webdunia
బుధవారం, 6 జులై 2016 (16:53 IST)
అంకుశాపూర్‌లోని ఎస్‌పీఆర్ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. యాజమాన్య వైఖరి కారణంగానే మృతి చెందినట్లు విద్యార్థి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా ఘటకేసర్ మండలం అంకుశాపూర్‌లో బుధవారం చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... అంకుశాపూర్‌లోని ఎస్‌పీఆర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆనంద్ గౌడ్ అనే విద్యార్ధి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ మంగళవారం అర్ధరాత్రి హాస్టల్‌ క్యాంపస్‌లోని కిటికీకి తాడు బిగించుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయాన్నే ఈ సంఘటనను గమనించిన తోటి విద్యార్ధులు స్కూల్ యాజమాన్యానికి సమాచారం అందించారు. దీంతో హాస్టల్ యాజమాన్యం పోలీసులకు సమాచారమిచ్చారు.
 
తద్వారా రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆనంద్ గౌడ్ మృతదేహాన్ని కిందకు దించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీలో ఉన్న ఆనంద్ తల్లిదండ్రులకు పోలీసులు విషయాన్ని తెలియజేశారు. దీంతో సంఘటనా స్థలానికి ఆనంద్ గౌడ్ పెదనాన్న చేరుకున్నారు. హాస్టల్ రెండో అంతస్తులో కిటికీకి ఆనంద్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడంతో మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు అన్నికోణాల్లో విచారణ జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చరణ్ కొడుకులాంటివాడు... నాకున్న ఏకైక మేనల్లుడు : అల్లు అరవింద్ (Video)

మా విడాకుల అంశం మీడియాకు ఓ ఎటర్‌టైన్మెంట్‌గా మారింది : నాగ చైతన్య (Video)

ఫన్‌మోజీ ఫేమ్ సుశాంత్ మహాన్ హీరోగా కొత్త చిత్రం.. పోస్టర్ విడుదల

అఖండ 2 – తాండవం లో బాలకృష్ణ ను బోయపాటి శ్రీను ఇలా చూపిస్తున్నాడా ?

ప్ర‌తి ఒక్క‌రూ హెల్త్ కేర్ తీసుకోవాలి : ఐశ్వర్య రాజేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments