Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదర్శ రైతుల్లా ఇజ్రాయెల్ వెళ్లేందుకు సిగ్గుండాలి: ఎర్రబెల్లి

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (19:07 IST)
ఇజ్రాయెల్‌లో జరుగనున్న అగ్రికల్చర్ సంబంధ ఎగ్జిబిషన్‌కు తెలంగాణ సర్కారు తరపున ఎమ్మెల్యేలను పంపడంపై టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు విరుచుకుపడ్డారు. తెలంగాణ సర్కారు పలువురు ఎమ్మెల్యేలను పంపించడంపై ఎర్రబెల్లి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఏనుగు రవీందర్ రెడ్డి, విద్యాసాగర్ రావు, కమలాకర్, మనోహర్ రెడ్డిలు ఇజ్రాయెల్ వెళుతున్న ప్రతినిధి బృందంలో ఉన్నారు. వారిని ఉద్దేశించి ఎర్రబెల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
వాళ్లు ఆదర్శ రైతులు కారని, ఆ ముసుగులో ఇజ్రాయెల్ వెళ్లి వ్యాపారాలు చక్కదిద్దుకునేందుకు యత్నిస్తున్నారని ఎర్రబెల్లి విమర్శించారు. కమలాకర్‌కు మైనింగ్ వ్యాపారం ఉందని, విద్యాసాగర్ రావుకు 'రియల్' బిజినెస్ ఉందని వివరించారు. ఆదర్శ రైతుల్లా ఇజ్రాయెల్ వెళ్లేందుకు సిగ్గుండాలని అన్నారు.
 
ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే రోజు కూలీ రూ.180కు పెరిగింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా కూలీని పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ పెంపు ఈ నెల 1 నుంచి అమల్లోకి రానుంది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments