Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్, సికింద్రాబాద్ ల నుంచి 121 స్పెషల్ ట్రైన్లు

Webdunia
శనివారం, 28 డిశెంబరు 2019 (17:44 IST)
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. హైదరాబాద్‌ - రామేశ్వరం మధ్య 18 సర్వీసులు నడపనున్నట్లు పేర్కొంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో అన్ని శుక్రవారాల్లో హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం 2.30గంటలకు రైలు బయలుదేరుతుందని చెప్పింది.

హైదరాబాద్‌–తిరుచిరాపల్లికి 16 సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. అన్ని సోమవారాల్లో రాత్రి 10.20 గంటలకు హైదరాబాద్‌ నుంచి ట్రైన్‌ స్టార్ట్‌ అవుతుందని పేర్కొంది. విల్లుపురం–సికింద్రాబాద్‌కు 18 సర్వీసులు నడపనున్నట్లు చెప్పింది. అన్ని బుధవారాల్లో విల్లుపురంలో సాయంత్రం 4 గంటలకు ట్రైన్‌ బయలుదేరుతుందని తెలిపింది.

అన్ని శుక్ర, ఆదివారాల్లో చైన్నెసెంట్రల్‌ నుంచి సికింద్రాబాద్‌కు 34 సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు శని, సోమవారాల్లో సికింద్రాబాద్‌కు చేరుకుని, తిరిగి అవే రోజుల్లో రాత్రి 8 గంటలకు చెన్నై  బయలుదేరనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్‌ – కొచువెలికి 17 సర్వీసులు, హైదరాబాద్‌ – ఎర్నాకులం మధ్య 18 సర్వీసులు నడపనున్నట్లు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" షూటింగుకు మళ్లీ బ్రేక్ ... డెంగ్యూబారినపడిన నటుడు!

బాలు వెళ్లిపోయాక అంతా చీకటైపోయింది ... : పి.సుశీల

Raviteja: వినాయక చవితికి రవితేజ మాస్ జాతార చిత్రం సిద్దం

Gaddar Award : అల్లు అర్జున్, నాగ్ అశ్విన్ లకు బెస్ట్ అవార్డులు ప్రకటించిన గద్దర్ అవార్డ్ కమిటీ

Sreeleela: పవన్ కళ్యాణ్ ఓజీ కోసం వస్తున్నారు.. డేట్లు సర్దుకో.. ఓకే చెప్పిన శ్రీలీల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments