Webdunia - Bharat's app for daily news and videos

Install App

యేడాది క్రితం తప్పు చేశా.. నా భర్త క్షమించాడు.. పిన్ని వేధిస్తుంది.. అందుకే చనిపోతున్నాం.. దంపతుల Selfie Video

వరుణ్
మంగళవారం, 16 జులై 2024 (11:34 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఓ దంపతుల జంట ఆత్మహత్య చేసుకుంది. బంధువులు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేయడంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఆ జంట రైలుకింద పడి ప్రాణాలు తీసుకున్నారు. వీరు ఈ దారుణానికి పాల్పడేముందు... ఓ సెల్ఫీ వీడియోలో తమ ఆవేదనను తెలియజేస్తూ, ఆ వీడియోను పోలీసులకు పంపించారు. ఆ వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఆ దంపతులను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపు ఆ దంపతులు తనవు చాలించారు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్ - మిట్టాపూర్ మధ్యలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. 
 
పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. పొతంగల్ మండలం హెగ్జోలికి చెందిన అనిల్ (28), పొతంగల్‌కు చెందిన శైలజ (24)కు ఏడాది క్రితం వివాహమైంది. వారిద్దరూ ఓ ఇంటర్వ్యూకు వెళ్తున్నట్లు కుటుంబీకులకు చెప్పి సోమవారం బయటకు వచ్చారు. అనంతరం తాను ఓ తప్పు చేశానని, దాన్ని భర్త క్షమించినా బంధువులు తమపై దుష్ప్రచారం చేస్తుండడాన్ని తట్టుకోలేక ఇద్దరం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు శైలజ వీడియో చిత్రీకరించి కోటగిరి ఎస్ఐ సందీప్‌కు పంపారు. 
 
ఆయన నవీపేట ఎస్ఐ యాదగిరి గౌడ్‌కు వీడియోతోపాటు వారి సెల్ఫోన్ నంబరు పంపారు. దంపతులు ఆత్మహత్య చేసుకునేందుకు గోదావరి వద్దకు వస్తున్నట్లు సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు బాసర వంతెన దగ్గరకు వెళ్లి గాలించగా కనిపించలేదు. బాధితుల ఫోన్ నంబరును ట్రాక్ చేయగా ఫకీరాబాద్ - మిట్టాపూర్ మధ్య ఉన్నట్లు నవీపేట ఎస్ఐ గుర్తించి అక్కడికి వెళ్లి గాలించగా ఇద్దరి మృతదేహాలు పట్టాలపై కనిపించాయి. రైల్వే పోలీసులకు సమాచారం అందించినట్లు ఎస్ఐ చెప్పారు.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments