Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రెండు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి.. రైల్వే శాఖ కీలక నిర్ణయం

ఠాగూర్
శనివారం, 8 మార్చి 2025 (12:01 IST)
భారతీయ రైల్వే శాఖ (దక్షిణ మధ్య రైల్వే) కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి నడిచే రెండు రైళ్ల ప్రారంభ స్థానాన్ని మార్చింది. చెన్నై సెంట్రల్ - హైదరాబాద్ ప్రాంతాల మధ్య నడిచే రైలు నంబరు 12603, హైదరాబాద్ - చెన్నై సెంట్రల్ ప్రాంతాల మధ్య నడిచే రైలు నంబరు 12604 రైళ్ళతో పాటు, గోరఖ్‌పూర్ - సికింద్రాబాద్ మధ్య నడిచే రైలు నంబరు 12589, సికింద్రాబాద్ - గోరఖ్‌పూర్ ప్రాంతాల మధ్య నడిచే 12590 రైళ్లు ఇకపై చర్లపల్లి కేంద్రం నడుస్తాయని పేర్కొంది. 
 
ఈ రెండు రైళ్లను ఇక నుంచి చెన్నై సెంట్రల్ - చర్లపల్లి, చర్లపల్లి - చెన్నై సెంట్రల్, గోరఖ్‌పూర్ - చర్లపల్లి, చర్లపల్లి - గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా వ్యవహరిస్తారు. చర్లపల్లి నుంచి చెన్నై సెంట్రల్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు నిన్నటి నుంచే చర్లపల్లి నుంచి ప్రయాణం ప్రారంభించగా గోరఖ్‌పూర్ నుంచి చర్లప్లి, చర్లప్లి నుంచి గోరఖ్‌పూర్ వైళ్లే రైళ్ల విషయంలో మాత్రం 12, 13వ తేదీల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఎపుడైనా బొక్కలో వేస్తారు జగనన్నా... శ్రీరెడ్డి వీడియో 
 
గత వైకాపా ప్రభుత్వంలో తన నోటికి అడ్డూ అదుపు లేకుండా పని చెప్పిన నటి శ్రీరెడ్డి ఇపుడు టీడీపీ కూటమి పాలకులను శరణు వేడుకుంటున్నారు. నోటికి తాళం వేసుకుని వైకాపా నేతలను బూతులు తిడుతున్నారు. తాజాగా ఆమె ఎక్స్ ఖాతాలో పెట్టిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జగనన్నా.. తనను ఈ రోజు కాకుంటే రేపు అయినా అరెస్టు చేసి బొక్కలో వేస్తారు.. ఆ రోజు వైఎస్ఆర్ సీపీ పిల్లని కాదని వైకాపా నేతలు చేతులెత్తేస్తారు అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. పైగా, ఏనాడైనా తనను వైఎస్ఆర్ సీపీ పిల్లని అని చెప్పారా అంటూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. 
 
పైగా, పవన్ కళ్యాణ్ అనే అస్త్రాన్ని టచ్ చేయాలంటే ఎవరైనా జడుసుకుంటున్నారన్నారు. దీనికి కారణం... వారి కార్యకర్తలను ఓ రక్షణ కవచంలా తయారు చేశారన్నారు. ఇపుడు వైకాపా గురించి ఎవరైనా పాజిటివ్‌గా పోస్ట్ పెడితే వారిని చీల్చి చెండాడుతున్నారన్నారు. పైగా, తనను కూడా ఇపుడు కాకుంటే రేపైనా, ఎపుడైనా అరెస్టు చేయడం ఖాయమన్నారు. ఆరోజున శ్రీరెడ్డి వైఎస్ఆర్ సీపీ పిల్లని కాదని చేతులెత్తేస్తారంటూ వైకాపా నేతలను బూతు పదజాలంతో దూషించారు. 
 
కాగా, గత వైకాపా అధికారంలో ఉన్నపుడు సినీ నటుడు పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీ సభ్యులు, చిరంజీవి తల్లి అంజనా దేవి, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, టీడీపీ నేత నారా లోకేశ్‌లతో పాటు వైకాపా మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజులను శ్రీరెడ్డి అసభ్య పదజాలంతో దూషిస్తూ కామెంట్స్ చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి - కొత్త సినిమా అప్ డేట్

నేను చెప్పింది కరెక్ట్ కాకపోతే నా హిట్ 3ని ఎవరూ చూడొద్దు : నాని

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments