కీలక నిర్ణయం తీసుకున్న టీఎస్ ఆర్టీసీ - ఆ తరహా టిక్కెట్ల జారీ నిలిపివేత

Webdunia
ఆదివారం, 31 డిశెంబరు 2023 (12:25 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీ-24, టీ-6 టికెట్ల జారీని నిలిపివేసింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. దీంతో బస్సుల్లో తీవ్రమైన రద్దీ నెలకొంది. పైగా, ఫ్యామిలీ-24, టీ-6 టిక్కెట్ల ప్రయాణం చేసే వారిని గుర్తింపు కార్డులు చూసి వయస్సు నిర్ధారించుకోవాల్సి ఉంది. దీంతో ఆలస్యమైపోతుంది. అంతిమంగా సమయ పాలనపై ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా ఈ రెండు టిక్కెట్ల జారీని నిలిపివేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. 
 
జనవరి ఒకటో తేదీ నుంచి ప్రస్తుతం జారీ చేస్తున్న ఫ్యామిలీ-24, టి-6 టికెట్ల జారీని నిలిపివేస్తున్నట్టు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఈ టికెట్లు జారీ చేయాలంటే ప్రయాణికులు తమ గుర్తింపు కార్డును కండక్టర్‌కు చూపించాల్సి ఉంటుంది. వారి వయసును టికెట్‌లో కండక్టర్ నమోదు చేయాల్సి ఉంటుంది. బస్సుల్లో ప్రస్తుతం నెలకొన్న రద్దీ కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమవుతుంది. ఇది అంతిమంగా ప్రయాణ సమయంపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురువుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ-24, టీ-6 టిక్కెట్లను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్టు సజ్జనార్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments