Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రైల్వే డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు అనేక రైళ్లు రద్దు!!

వరుణ్
ఆదివారం, 16 జూన్ 2024 (15:47 IST)
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు షాకింగ్ వార్త చెప్పింది. తమ డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు అనేక రైళ్లను రద్దు చేయనున్నట్టు తెలిపింది. ముఖ్యంగా, కాజీపేట - సిర్పూర్ కాగజ్ నగర్ ప్రాంతాల మధ్య ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. వీటిలో ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లు కూడా ఉన్నాయి. సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునకీకరణ పనులు చేపట్టేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అందువల్ల ఈ మార్గంలో రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. సిగ్నల్ వ్యవస్థ లోపం వల్లే బాలాసోర్ వద్ద మూడు రైళ్లు ఢీకొని ఘోర ప్రమాదం జరిగిందని గుర్తుచేసింది. 
 
రద్దు చేసిన రైళ్లు ఇవే.. 
17003 కాజీపేట - కాగజ్‌నగర్ రైలు ఈ నెల 17 నుంచి జులై 6 వరకు
12757/58 కాగజ్ నగర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 23 నుంచి జులై నెల 6 వరకు
12967 చెన్నై - జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 23, 25, 30, జులై 2,7 తేదీల్లో రద్దు
12968 జైపూర్ - చెన్నై జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 21, 23, 28, 30, జులై 5న రద్దు
12975 మైసూర్ - జైపూర్ సూపర్ ఫాస్ట్ ఈ నెల 27, 29, జులై 4, 6 తేదీల్లో రద్దు
12539 యశ్వంత్‌పూర్ - లక్నో ఈ నెల 26, జులై 3న రద్దు
12540 లక్నో - యశ్వంత్‌పూర్ ఈ నెల 28, జులై 5 తేదీల్లో రద్దు
12577 భాగమతి - మైసూర్ సూపర్ ఫాస్ట్ ఈ నెల 28న మరియు వచ్చే నెల 5న రద్దు
22619 బిలాస్‌పూర్ - త్రివేండ్రం తిరునల్వేలి ఎక్స్‌ప్రెస్ ఈ నెల 25, జులై 2 రద్దు
22620 త్రివేండ్రం - బిలాస్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 23, 30 తేదీల్లో రద్దు
22352 పాటలీపుత్ర - శ్రీమాతా వైష్ణో ఈ నెల 21, 28, జులై 5వ తేదీల్లో రద్దు
22352 శ్రీమాత వైష్ణో - పాటలీపుత్ర ఈ నెల 24, జులై 1, 8 తేదీల్లో రద్దు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga chaitanya Sobhita dhulipala Wedding నాగచైతన్య-శోభిత పెళ్లి

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... చాలే ఇది చాలే... చిన్నారి డ్యాన్స్ అదిరింది.. (వీడియో)

క్రైం థ్రిల్లర్ గా వరుణ్ సందేశ్ చిత్రం కానిస్టేబుల్

మోక్షజ్ఞతో ఆదిత్య 369కి సీక్వెల్‌ గా ఆదిత్య 999 మ్యాక్స్

డ్రింకర్ సాయి బ్యాడ్ బాయ్స్ బ్రాండ్ తో విడుదలకు సిద్ధంగా ఉన్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hair fall control tips ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గిపోతుంది

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

తర్వాతి కథనం
Show comments