పిక్నిక్‌కు వెళ్లారు.. యాదగిరి గుట్టలో ఆ ముగ్గురిని కలిశారు.. చివరికి?

సెల్వి
గురువారం, 25 సెప్టెంబరు 2025 (10:10 IST)
వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలు జరుగుతున్నాయి. తాజాగా సరదాగా బయటకు వెళ్లిన ముగ్గురు బాలికలు ముగ్గురు మృగాళ్ల చేతిలో చిక్కారు. మాయమాటలు చెప్పి పిక్నిక్‌ పేరుతో యాదగిరిగుట్టకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. వివరాల్లోకి వెళితే.. వెంకటాపురానికి  చెందిన ముగ్గురు తొమ్మిదవ తరగతి విద్యార్థినీలు బడిలో బతుకమ్మ వేడుకలు ఉన్నాయని ఇంట్లోవాళ్లకు చెప్పి ఈనెల 20న ఆధార్‌ కార్డులు పట్టుకొని బయటకు వెళ్లారు. అయితే ఆ ముగ్గురు స్కూలుకు వెళ్లకుండా ఆల్వాల్‌ గోల్నాక చౌరస్తావద్ద బస్సెక్కి సికింద్రాబాద్‌కు చేరుకున్నారు. 
 
ఈ లోపు ఓయూ మాణికేశ్వరి నగర్‌కు చెందిన, జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 19 ఏళ్ల యువకుడు గండికోట్‌ మధు(19) బాలికలను చూసి వారితో మాటలు కలిపాడు. అనంతరం అతడి స్నేహితులు వారాసిగూడకు చెందిన గడ్డం వంశీ అరవింద్‌ (22), అతడి సమీప బంధువు మల్లేశ్వర్‌నగర్‌కు చెందిన ఈసం నీరజ్ ‌(21)ను పిలిచాడు. అనంతరం అందరూ కలిసి ఓ హోటల్‌లో భోజనం చేశారు. 
 
మంచిగా మాట్లాడటంతో బాలికలకు వీరిపై నమ్మకం పెరిగింది. సరదాగా బయటకు వెళ్దామని అందరూ అనుకుని బస్సులో యాదగిరిగుట్టకు తీసుకెళ్లారు. అక్కడే లాడ్జిలో మూడు వేర్వేరు గదులు అద్దెకు తీసుకున్నారు. రాత్రంతా ఆ గదిలోనే ఉన్నారు. ఆ రాత్రి  బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. 21వ తేదీన ఆరుగురు కలిసి హైదరాబాద్‌కు వచ్చారు. 
 
ఓయూ పీఎస్‌ పరిధిలో బాలికలను వదిలిపెట్టి, ముగ్గురు యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే 20వ తేదిన ముగ్గురు విద్యార్థినీలు బడికి రాకపోవడంతో ఓ టీచర్‌.. తల్లిదండ్రులకు ఫోన్‌ చేశారు. అయితే వారు గట్టిగా నిలదీసేసరికి.. జరిగిదంతా చెప్పారు. వైద్య పరీక్షలు చేయించగా అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది. పోలీసులు నిందితులతోపాటు గది అద్దెకు ఇచ్చిన సోమేశ్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments