Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ మెచ్చిన ఎకో రిక్రియేషనల్ పార్క్, మన హైదరాబాదులో...

ఐవీఆర్
మంగళవారం, 28 జనవరి 2025 (21:49 IST)
ఫోటో కర్టెసి- సోషల్ మీడియా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా మొట్టమొదటి ఎకో రిక్రియేషనల్ పార్క్ మంగళవారం నాడు హైదరాబాద్‌లో ప్రారంభించబడింది. ఈ సరికొత్త పర్యాటక ఆకర్షణ హైదరాబాద్‌లోని చిల్కూరులోని ప్రగతి రిసార్ట్స్ సమీపంలోని ప్రొద్దుటూరు గ్రామంలో ఉంది. ప్రకృతి ప్రేమికులు తప్పక సందర్శించాల్సిన ప్రదేశంగా స్వయంగా మెగాస్టార్ చిరంజీవి చెప్పారు.
 
150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ అద్భుతమైన పార్క్ ప్రకృతి, కళ, పురాతన కళలను మిళితం చేస్తుంది, 15,000 పైగా వృక్ష జాతులు, అరుదైన చెట్లు మరియు సజీవ శిల్పాలతో సృజనాత్మకతను పునర్నిర్వచిస్తుంది. జపనీస్ తోటలు, 3 వేల సంవత్సరాల పురాతనమైన చెట్లు, పూల మండలాలు, సాహస దారులు, విలాసవంతమైన బసలు కోసం ఇక్కడకు రావచ్చు.
 
ఇక్కడ ఫస్ట్ షూటింగ్ చేసేది నా సినిమానే: మెగాస్టార్ చిరు
చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్‌లో రామడుగు రాందేవ్ రావు ఎక్స్‌పీరియం పార్క్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు, సీఎం రమేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. 
 
ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘రాందేవ్‌తో నా పరిచయం ఇప్పటిది కాదు. ఈ ఎక్స్‌పీరియం పార్కుని మీ అందరి కంటే ముందుగా నేను చూశాను. 2000వ సంవత్సరంలోనే దీని గురించి రాందేవ్ నాతో పంచుకున్నారు. 2002 నుంచి నేను కూడా రాందేవ్ వద్ద నుంచి మొక్కల్ని తెప్పించుకుంటూనే ఉన్నాను. మా ఇంట్లో ఉండే అనేక రకాల మొక్కలు, చెట్లు రాందేవ్ వద్ద నుంచి వచ్చినవే. రాందేవ్‌ ఓ వ్యాపారవేత్తగా ఎప్పుడూ ఆలోచించరు. పర్యావరణం, ప్రకృతి గురించి ఆలోచిస్తుంటారు. ఈ 150 ఎకరాలను వాణిజ్యంగానూ వాడుకోవచ్చు. కానీ ఆయన ఈ 25 ఏళ్లుగా రకరకాల మొక్కల్ని, వివిద దేశాల నుంచి కొత్త జాతి మొక్కల్ని ఇక్కడకు తీసుకొచ్చి ఈ పార్కుని నిర్మించారు. ఈ రకంగా రాం దేవ్ ఓ మంచి ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు.
 
ఈ ఎక్స్‌పీరియం పార్కుని చూసి నేను, గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు షాక్ అయ్యాం. ఇంత అద్భుతంగా ఉన్న ఈ పార్కుని చూసి షూటింగ్‌కు ఇస్తారా? అని రాం దేవ్‌ను అడిగాను. ఫస్ట్ షూటింగ్ చేసేది నా సినిమానే అయితే ఇస్తామని అన్నారు. కానీ ఈ ఎండలో నేను ఇక్కడ హీరోయిన్‌తో స్టెప్పులు వేయడం అంటే కాస్త కష్టమే. వర్షా కాలం తరువాత ఇక్కడ మరింత గ్రీనరి వస్తుందని ఆ టైంలో షూటింగ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. వెడ్డింగ్, రిసెప్షన్, ఇతర కార్యక్రమాలకు ఈ చోటు అనువైనదిగా ఉంటుంది.
 
దేశవిదేశాల్లో ఉండే ఎన్నో అరుదైన జాతి మొక్కల్ని ఒక చోటకు చేర్చి ఇంత అద్భుతమైన పార్కుని రాం దేవ్ నిర్మించారు. ఇలాంటి మహోత్తర కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం అభినందనీయం. ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా ఇలాంటి ప్రకృతి, పర్యావరణ సంరక్షణ కార్యక్రమాలకు రావడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments