తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరింది. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో
Farmers
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పీఎంఎఫ్‌బీవై సీఈవో, కేంద్ర సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా 2016 నుంచి 2020 వరకు పీఎంఎఫ్ బీవైలో తెలంగాణ ఉనికి, నాటి ప్రభుత్వం దాని నుంచి వైదొలిగిన తీరుపై చర్చ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం పిఎంఎఫ్‌బివైలో తిరిగి చేరడంతో, రైతులు వచ్చే పంట సీజన్ నుండి ఈ పథకం నుండి పంట బీమా పొందుతారు. రైతులు PMF BYతో ప్రయోజనం పొందుతారని, పంట నష్టం జరిగితే సకాలంలో పరిహారం అందించబడుతుందని రితేష్ చౌహాన్ తెలియజేసారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో రైతు ఆధారిత విధానాల అమలుకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.
ప్రధాన మంత్రి ఫసల్‌బీమా యోజన (PMFBY) పథకం 2016 వర్షాకాలం నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. దీనికి చెల్లించే ప్రీమియంలో రైతులతో పాటు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వాటాగా కొంత మొత్తాన్ని భరిస్తాయి.
'
కానీ ఈ పథకం అమలులో రైతుల కంటే బీమా కంపెనీలే ఎక్కువ లబ్ధి పొందాయన్న వాదన ఉంది. ప్రీమియం రేట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయని విమర్శలు వచ్చాయి.