Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు ఏమయ్యారు?

ఠాగూర్
సోమవారం, 19 మే 2025 (19:15 IST)
తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట పట్టణంలోని ఖాదర్‌పుర వీధిలో నివసించే ఓ కుటుంబంలోని ఐదుగురు సభ్యులు అదృశ్యమయ్యారు. శనివారం ఉదయం నుంచి వారు కనిపించడం లేదు. ఫోన్లను ఇంట్లోనే వదిలివేసి వెళ్లారు. స్థానికులు, బంధువులు ఏదైనా ఊరికి వెళ్లారని భావించారు. కానీ, రోజులు గడుస్తున్నా వారి జాడ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
ఇంటి నుంచి కనిపించకుండా పోయిన వీరబత్తిన బాలకిషన్‌కు అప్పులు ఉన్నాయని, తనకు డబ్బులు ఇచ్చేవారు ఇవ్వకపోవడంతో వడ్డీలు కట్టలేక ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నట్టు లేఖ రాసిపెట్టారని బంధువులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
బాలకిషన్ తండ్రి జనార్ధన్, భార్య వరలక్ష్మి, కుమారుడు శ్రవణ్, కుమార్తెలు కావ్య, శిరీష కనిపించడం లేదని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... అదృశ్యమైన వారి కోసం గాలిస్తున్నారు. అలాగే, వారి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీపీ మధు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Manisharma: మణిశర్మ ఆవిష్కరించిన వసుదేవ సుతం గ్లింప్స్

పెళ్లి పీటలెక్కనున్న విశాల్.. వధువు ఎవరంటే?

ఏస్ చిత్రంలో జూదం అనేది ఉప్పెనలాంటిదంటున్న విజయ్ సేతుపతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments