తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఆ రాష్ట్ర విత్తమంత్రి భట్టి విక్రమార్క శనివారం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది పూర్తిస్థాయి బడ్జెట్ కాకపోవడంతో ఎలాంటి ఆకర్షణీయమైన ప్రకటనలు, పథకాలకు అవకాశం లేకుండానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ రూ.2,75,894 కోట్లుగా మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటూ స్వేచ్ఛను సంపాదించుకున్నారు. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నట్టు తెలిపారు. ఈ బడ్జెట్‌న సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో రూపొందించి, సభలో ప్రవేశపెడుతున్నట్టు పేర్కొన్నారు.
త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు నెలల కాలానికి సంబంధించిన కేటాయింపులే బడ్జెట్‌లో వెల్లడించారు. ఈ యేడాది మొత్తానికి అంచనాలు ప్రకటించారు. అంతకుముందు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.