Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సురవరం'కు సీఎం చంద్రబాబు నివాళులు - పోరాట వారసత్వం ఇచ్చి వెళ్లారు...

ఠాగూర్
ఆదివారం, 24 ఆగస్టు 2025 (17:10 IST)
సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి పార్ధివ దేహానికి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నివాళులు అర్పించారు. ఇందుకోసం ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్‌కు చేరుకుని మఖ్దూం భవన్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచిన సురవరం పార్ధివ దేహానికి సీఎం బాబు నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయనతో తనకున్న జ్ఞాపకాలను అక్కడి నేతలతో పంచుకున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సురవరం సుధాకర్ రెడ్డి పోరాడారని తెలిపారు. కమ్యూనిస్టు ఉద్యమం, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తుచేశారు. 
 
"సురవరంతో నాకు సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. సుధాకర్ రెడ్డి, నేను కలిసి ఎన్నో రాజకీయ పోరాటాలు చేశాం. నిత్యం ప్రజాహితం కోసం కలిసి పోరాడాం. ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజలకు సేవలందించారు. సుధాకర్ రెడ్డి నన్ను ప్రత్యేకంగా అభిమానించేవారు. నేను చేసే పనుల్ని, కార్యక్రమాల్ని అభినందించి ప్రోత్సహించేవారు. ఆయన సేవల్నీ పోరాటలను నా జీవితంలో ఎపుడూ మర్చిపోలేను. సుధాకర్ రెడ్డి భౌతికంగా మనకు దూరమైనా  ఆయన పోరాట వారసత్వాన్ని మనకు ఇచ్చిపోయారు. సుధాకర్ రెడ్డి మరణం సీపీఐతో పాటు తెలుగువారికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలుపుకుంటున్నాను" అని చంద్రబాబు అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐదు పదుల వయసులో శిల్పాశెట్టి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments