Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : కవితకు బెయిల్ వస్తుందా? రాదా?

ఠాగూర్
మంగళవారం, 20 ఆగస్టు 2024 (10:29 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయి తీహార్ జైలులో ఉంటున్న భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కె.కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరుపనుంది. దీంతో ఆమెకు బెయిల్ వస్తుందా? రాదా? అన్నది ఇపుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ స్కామ్‌లో అరెస్టయిన కవిత.. గత మార్చి 26వ తేదీ నుంచి తీహార్ జైలులో ఉంటున్న విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో బెయిల్ కోరుతూ ఆమె తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆమె ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 
 
లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 16వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు హైదరాబాద్ నగరంలో అరెస్టు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి ఆమెను నేరుగా ఢిల్లీకి తరలించి మార్చి 16వ తేదీన ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. ఆమెకు కోర్టు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ఫలితంగా మార్చి 16వ తేదీ నుంచి ఆమె తీహార్ జైలులో ఉంటున్నారు. తీహార్ జైలులో ఉండగానే ఎంటరైన సీబీఐ కవితను అరెస్టు చేసింది. ఈ క్రమంలో ఇటీవల ఆమె స్వల్ప అస్వస్థతకు లోనైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments