Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్టాపులో మహిళకు గుండెపోటు... సీపీఆర్ చేసి రక్షించిన పోలీస్ ఎస్ఐ

ఠాగూర్
ఆదివారం, 11 ఫిబ్రవరి 2024 (13:36 IST)
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బస్సు కోసం చేసివున్న ఓ మహిళకు ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో ఆమె కుప్పకూలిపోయింది. దీంతో పక్కనే ఉన్న ఆమె భర్త.. కేకలు వేస్తూ తన భార్యను కాపాడాలంటూ బిగ్గరా కేకలు వేశాడు. ఆ కేకలు అక్కడే ఉన్న ఓ పోలీస్ ఎస్ఐ ఒక్క పరుగున అక్కడకు వచ్చి ఆ మహిళకు సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించాడు. ఆ తర్వాత ఆ మహిళను ఆస్పత్రికి తరలించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎస్ఐ సమయస్ఫూర్తిని నెటిజన్లు మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటన భువనగిరి బస్టాపులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, భువనగిరి మండలం మన్నెవారిపంపు గ్రామానికి చెందిన బోయిన వెంకటమ్మ, నర్సింహా దంపతులు ఆదివారం బస్టాపులో బస్సు కోసం వేచి చూస్తున్నారు. ఉన్నట్టుండి వెంకటమ్మ ఆకస్మికంగా కుప్పకూలింది. ఉలుకూ పలుకూ లేకుండా పడిపోయిన భార్యను చూసిన భర్త.. ఏం చేయాలో తెలియక నర్సింహా కేకలు వేశాడు. భార్యను కాపాడాలంటూ నర్సింహా కేకలు వేశాడు. 
 
ఆ సమయంలో అటుగా వెళుతున్న వెలిగొండ ఎస్ఐ డి.మహేందర్ లాల్ స్పందించారు. వెంటనే అక్కడికి చేరుకుని వెంకటమ్మను పరిస్థితిని గమనించారు. గుండెపోటుకు గురైందని భావించి సీపీఆర్ చేయడంతో కాసేపటికి వెంకటమ్మ కళ్లు తెరిచింది. ఆపై వెంకటమ్మను తన హయాంలో దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వెంకటమ్మకు ప్రాణాపాయం తప్పిందని, సకాలంలో సీపీఆర్ చేయడంతో ఆమె బతికిందని వైద్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments