తెలంగాణాలో వడగండ్ల వర్షం.. రేపు హైదరాబాద్‌లో వర్షం...

ఠాగూర్
సోమవారం, 18 మార్చి 2024 (09:25 IST)
తెలంగాణ రాష్ట్రంలో వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం హైదరాబాద్ నగరంలో వర్షం కురుస్తుందని చెప్పారు. అలాగే, రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన వాతావరణం కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న ఐదు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
 
మంగళవారం ఉదయం వరకు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విస్తాయని వెల్లడించింది. 
 
సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు నిర్మల్, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని, హైదారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
మంగళవారం నుంచి బుధవారం వరకు సంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, కరీంనగర్, కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments